విక్టరీ వెంకటేష్, నాగ చైతన్య రియల్ లైఫ్ లో మామ అల్లుళ్లు. ఈ మామ అల్లుళ్లు కలసి నటించిన మల్టీస్టారర్ చిత్రం వెంకీమామ గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జైలవకుశ ఫేమ్ బాబీ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మంచి అంచనాలతో విడుదలైన వెంకీమామ చిత్రానికి పూర్తి స్థాయిలో పాజిటివ్ టాక్ రాలేదు. ఈ చిత్రంలో కేవలం బి, సి సెంటర్స్ లో మాత్రమే రాణిస్తుందని క్రిటిక్స్ భావించారు. 

అందరి అంచనాలని తలక్రిందులు చేస్తూ మామ అల్లుళ్లు బాక్సాఫీస్ వద్ద రచ్చ చేస్తున్నారు. ఫస్ట్ వీకెండ్ లోనే వెంకిమామ చిత్రం సగానికిపైగా పెట్టుబడి రాబట్టేసింది. సోమవారం నుంచి ఈ చిత్రానికి అసలైన పరీక్ష మొదలవుతుందని అంతా భావించారు. కానీ మండే టెస్ట్ ని కూడా వెంకీ మామ మూవీ విజయవంతంగా అధికమించింది. 

సోమవారం రోజు వెంకీమామ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల వరకు షేర్ రాబట్టింది. దీనితో మొత్తం నాలుగు రోజుల్లో వెంకీ మామ చిత్రం 18 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. దీనితో వెంకీమామ చిత్రం విజయం కమర్షియల్ గా ఖరారైనట్లే అని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటివరకు నైజాంలో అత్యధికంగా 7.3 కోట్ల షేర్ నమోదు కాగా, సీడెడ్ లో 3 కోట్లు, ఉత్తరాంధ్రలో 2.5 కోట్ల షేర్ రాబట్టింది. 

అనసూయపై స్పైసీ కామెంట్.. ఫోటో బయట పెట్టిన డైరెక్టర్!

వెంకీ మామ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. వెంకటేష్ కు జోడిగా పాయల్ రాజ్ పుత్, నాగ చైతన్య సరసన రాశి ఖన్నా హీరోయిన్లుగా నటించారు. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రంలో వెంకటేష్, నాగ చైతన్యలు మామ అల్లుళ్లుగా అద్భుతంగా నటించారనే ప్రశంసలు దక్కుతున్నాయి. 

'వెంకీ మామ' మంచి ఛాన్స్ మిస్ చేసుకున్నాడా?