యాంకర్ గా, నటిగా అనసూయ టాలీవుడ్ లో దూసుకుపోతోంది. బుల్లితెర కార్యక్రమాలతో అనసూయ అందమైన యాంకర్ గా గుర్తింపు సొంతం చేసుకుంది. క్షణం, సోగ్గాడే చిన్ని నాయనా, రంగస్థలం లాంటి చిత్రాలు అనసూయకు నటిగా మంచి గుర్తింపుని తీసుకువచ్చాయి. 

అనసూయ కోసం దర్శకులు లేడి ఓరియెంటెడ్ కథలు సిద్ధం చేసే స్థాయికి ఆమె క్రేజ్ చేరుకుంది. అయినా కూడా అనసూయ యాంకరింగ్ కొనసాగిస్తూనే అవకాశం వచ్చిన చిత్రాల్లో నటిస్తోంది. క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ప్రస్తుతం వరుస పరాజయాల్లో ఉన్నారు. నక్షత్రం లాంటి డిజాస్టర్ తర్వాత తిరిగి పుంజుకునేందుకు కృష్ణవంశీ ప్రయత్నిస్తున్నారు. 

యాంకర్ అనసూయ సెక్సీ ఫోజులు.. పిచ్చెక్కించేలా గ్లామర్ షో!

ఇటీవల కృష్ణవంశీ 'రంగమార్తాండ' అనే ఆసక్తికర చిత్రాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, రాజశేఖర్ కుమార్తె శివాత్మిక, రాహుల్ సిప్లిగంజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. యాంకర్ అనసూయ కూడా ఈ మూవీ లో కీలక పాత్రలో నటిస్తోంది. కృష్ణవంశీ చిత్రంలో మహిళా నటీమణుల పాత్రలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అందుకే ప్రతి ఒక్క నటి కృష్ణవంశీ దర్శకత్వంలో నటించాలని కోరుకుంటారు. ఆ అవకాశం అనసూయని వరించింది. 

తాజాగా కృష్ణవంశీ రంగమార్తాండలో అనసూయ పాత్ర గురించి ఆసక్తికర కామెంట్ చేశాడు. రంగమార్తాండ చిత్రంలో అనసూయ అందమైన స్టిల్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ స్టిల్ లో అనసూయ సాంప్రదాయ వస్త్రధారణలో, చిరునవ్వుతో అందంగా కనిపిస్తోంది. రెగ్యులర్ గా కృష్ణవంశీ చిత్రాల్లో కనిపించే పూల తోరణాలు, అరిటాకులతో ముస్తాబు చేసిన వేదిక కనిపిస్తోంది. 

ఎప్పుడూ చిరునవ్వుతో ఉండే సంచలన నటి అనసూయతో కలసి పనిచేయడం సంతోషంగా ఉంది. అనసూయ నా చిత్రంలో స్పైసీ రోల్ లో నటిస్తోంది అని కృష్ణవంశీ కామెంట్ చేశారు. ఈ ట్వీట్ కు అనసూయ ప్రతిస్పందించింది. అయన చిత్రాలు ఎప్పుడు చూసినా ఆదర్శవంతంగా అనిపిస్తాయి. అయన చిత్రాల్లో అమ్మాయిలకు ఎలాంటి పాత్ర వచ్చినా అది ఒక డ్రీమ్ లాంటిదే. కృష్ణవంశీగారి దర్శకత్వంలో నటించడం ద్వారా ఆ కల నెరవేరబోతోంది అని అనసూయ స్పందించింది. మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఈ చిత్రంలో భావోద్వేగాలు ప్రధానంగా ఉంటాయని ఇదివరకే కృష్ణవంశీ ప్రకటించారు.