సురేష్ బాబు లాంటి పెద్ద నిర్మాత, అనుభవం ఉన్న డిస్ట్రిబ్యూటర్ ముందు రకరకాలుగా ఆలోచించి రిలీజ్ డేట్ పై నిర్ణయం తీసుకుంటారు.  ‘వెంకీ మామ’  విషయంలోనూ ఆయన చాలా కాలం వాయిదాలు వేసుకుంటూ సరైన డేట్ కావాలని వెతికి, లాస్ట్ మినిట్ వరకూ తేల్చుకోలేకపోయారు. చివరకు తెగించి అన్ సీజన్ అయినా వెంకీ పుట్టిన రోజు సందర్బంగా రిలీజ్ చేసారు. సంక్రాంతికి ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వేద్దామనుకుని, ఎందుకులే మహేష్, అల్లు అర్జున్ వంటి వారితో పోటి అని వెనక్కి తగ్గారు. అయితే ఇప్పుడు సురేష్ బాబు తన నిర్ణయం పై నాలుక కరుచుకుంటున్నట్లు సమాచారం.

మొదటి రోజే కలెక్షన్స్ తో రికార్డ్ క్రియేట్ చేసిన సినిమాలు

ఎందుకంటే.. ‘వెంకీ మామ’ చిత్రం ఊహించని విధంగా మంచి కలెక్షన్స్ రాబడుతోంది. వీకెండ్ లో ఇరవై కోట్లకు పైగా షేర్ వసూలు చేసినట్లు నిర్మాతలే అఫీషియల్ గా ప్రకటించారు. ఇంకో పదికోట్లు దాకా షేర్ వస్తుందని అంచనా వేస్తున్నారు. అయితే అదే సంక్రాంతి సీజన్ లో ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ రిలీజ్ చేసినట్లు అయితే ఖచ్చితంగా నలభై కోట్లు షేర్ వచ్చేది. అ రకంగా ఓ పెద్ద ఆపర్చునిటీని మిస్ చేసుకున్నట్లు అయ్యిందని ట్రేడ్ లో అంటున్నారు. ఇక సురేష్ బాబు ఈ సినిమాని సీడెడ్ లో మినహా అన్ని ఏరియాలో రిలీజ్ చేసారు.

నిజ జీవిత మామా అల్లుళ్లైన వెంకటేశ్, నాగచైతన్యల మల్టీస్టారర్‌ మూవీ ‘వెంకీ మామ’ . కేయస్‌ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో పాయల్‌ రాజ్‌పుత్, రాశీ ఖన్నా హీరోయిన్స్. సురేశ్‌బాబు, టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించారు.  డిసెంబర్‌ 13 అంటే వెంకటేశ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా రిలీజ్‌  అయ్యింది. వీకెండ్ కలెక్షన్స్ బాగానే ఉన్నాయి. వెంకీ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన ‘ఎఫ్‌ 2’, చైతన్య కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘మజిలీ’ని మించి ‘వెంకీ మామ’ వసూళ్లు సాధిస్తుందని భావిస్తున్నారు.

మామా అల్లుళ్ల మధ్య అనుబంధం ప్రధానంగా భావోద్వేగాలు, ఫన్నీ సన్నివేశాలతో రూపొందిన సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇందులో వెంకీకి జోడీగా పాయల్‌ రాజ్‌పుత్‌, చైతన్యకు జోడీగా రాశీ ఖన్నా సందడి చేశారు. తమన్‌ బాణీలు అందించారు. ప్రకాశ్‌రాజ్‌, రావు రమేశ్‌ కీలక పాత్రల్లో కనిపించారు.