బిగ్ బాస్ 3 గ్రాండ్ ఫినాలేకి ఫైనల్ చేరుకున్న కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. నాగార్జున ఒక్కొక్కరితో మాట్లాడుతూ ఎవరు విజయం సాధిస్తారు అని అడిగారు. అదే విధంగా సరదాగా కూడా మాట్లాడారు. వరుణ్ సందేశ్ తండ్రి, వాళ్ళ బామ్మ విజయలక్ష్మి కూడా ఈ షోకి హాజరయ్యారు. 

వరుణ్ గురించి అతడి తండ్రి మాట్లాడుతూ నాగార్జునతో సెంటిమెంట్ డైలాగులు కొట్టారు. వరుణ్ ని చూపినపుడల్లా మీరు, మీ తండ్రి ఏఎన్నార్ గారు కలసి నటించిన ఇద్దరు ఇద్దరే చిత్రంలోని 'ఓనమాలు నేర్పాలని అనుకున్న కన్నా'అనే పాట గుర్తుకు వస్తుందని తెలిపారు. వరుణ్ మంచి ప్రవర్తన బిగ్ బాస్ షో ద్వారా అందరికి తెలిసిందని అన్నారు. 

Bigg Boss 3: శ్రీముఖినే విన్నర్.. తమన్నా కామెంట్స్!

ఇక వరుణ్ సందేశ్ బామ్మ చాలా సరదాగా నాగార్జునతో మాట్లాడింది. నా మనవడిని చూడడానికే కాదు.. మిమ్మల్ని చూడడానికి కూడా ఈ షోకి తాను హాజరయ్యానని ఆమె అన్నారు. మనం చిత్రంలో శ్రీయకు ఐలవ్యూ చెప్పే సన్నివేశం, గీతాంజలిలో ఏ..ఏ అంటూ హీరోయిన్ తో సాగే సన్నివేశాలు తనకు చాలా ఇష్టమని వరుణ్ బామ్మ విజయలక్ష్మి నాగార్జునతో అన్నారు. నాగార్జున తిరిగి బామ్మకు ఐలవ్యూ చెప్పారు.  

Bigg Boss3: నాగార్జున గ్రాండ్ ఎంట్రీ.. వాళ్ళిద్దరిలో ఎవరైనా ఓకే అంటున్న శివజ్యోతి