Asianet News TeluguAsianet News Telugu

Bigg Boss 3: శ్రీముఖినే విన్నర్.. తమన్నా కామెంట్స్!

ఆదివారం నాడు గ్రాండ్ ఫినాలే అంతే గ్రాండ్ గా మొదలైంది. భారీ స్థాయిలో భారీ ఏర్పాట్లతో షోని మొదలుపెట్టారు. ముందుగా హౌస్ నుండి ఎలిమినేట్ అయిన హౌస్ మేట్స్ అందరూ తమ డాన్స్ లతో షోని మొదలుపెట్టారు

Bigg Boss 3: grand finale episode
Author
Hyderabad, First Published Nov 3, 2019, 6:30 PM IST

బిగ్ బాస్ సీజన్ 3 చివరి దశకి చేరుకుంది. టైటిల్ విన్నర్ ఎవరనే విషయం మరికాసేపట్లో తెలియనుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో రాహుల్‌ సిప్లిగంజ్‌ విన్నర్‌ అంటూ ప్రచారం జరుగుతోంది. ఆదివారం నాడు గ్రాండ్ ఫినాలే అంతే గ్రాండ్ గా మొదలైంది. భారీ స్థాయిలో భారీ ఏర్పాట్లతో షోని మొదలుపెట్టారు.

ముందుగా ఎలిమినేట్ అయిన కంటెస్టంట్స్అందరూ తమ డాన్స్ పెర్ఫార్మన్స్ తో షోని మొదలుపెట్టారు. హోస్ట్ నాగార్జున కూడా వారితో కలిసి చిందులేశారు. అనంతరం నాగార్జున ఎలిమినేట్ అయిన ఒక్కో కంటెస్టంట్ ని బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వెళ్లిన తరువాత తమ లైఫ్ ఎలా ఉందని అడిగారు.

Bigg Boss 3: మాజీ కంటెస్టంట్స్ డాన్స్ లతో ఫినాలే స్టార్ట్

అలానే హౌస్ లో తమ ఫేవరేట్ కంటెస్టంట్ ఎవరు..? ఎవరు విన్నర్ కాబోతున్నరనే ప్రశ్నలు అడిగారు. తమన్నా దగ్గరకి వచ్చేసరికి తన ఫేవరేట్ కంటెస్టంట్ శ్రీముఖి అని చెప్పింది.

హౌస్ లో ఉన్నన్ని రోజులు తను కంఫర్టబుల్ గా ఉండడానికి కారణం శ్రీముఖి అని తను చాలా స్ట్రాంగ్ కంటెస్టంట్ అని చాలా బాగా ఆడుతుందని.. తనే విన్నర్ అవుతుందని చాలా స్ట్రాంగ్ గా చెప్పింది. ఇప్పటికే రాహుల్ విన్నర్‌, శ్రీముఖి రన్నరప్‌ అనే ప్రచారంపై క్లారిటీ రావాలంటే ఈ రోజు షో ముగిసే వరకు వెయిట్‌ చేయాల్సిందే.
 

Follow Us:
Download App:
  • android
  • ios