దాదాపు మూడున్నర నెలలుగా తెలుగు ప్రేక్షకులని అలరించిన బిగ్ బాస్ సీజన్ 3నేటితో ముగియబోతోంది. నవంబర్ 3 ఆదివారం రోజున బిగ్ బాస్ షో గ్రాండ్ ఫినాలే కు ముస్తాబైంది. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఐదుగురిలో ఎవరు విజేతగా నిలబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది. కాగా ప్రస్తుతం కలర్ ఫుల్ గా బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే జరుగుతోంది.   

ఎలిమినేట్ అయిన హౌస్ మేట్స్ డాన్స్ ఫెర్ఫామెన్స్ తో బిగ్ బాస్ సీజన్ 3 ఫైనల్ గ్రాండ్ గా ప్రారంభమైంది. నాగార్జున మనం చిత్రంలోని  బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వస్తుండగా అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు. నాగ్ రాగానే వేదిక వద్ద ప్రేక్షకుల కోలాహలం, హర్షద్వానాలు వినిపించాయి. 

కింగ్ మూవీ లోని హుషారెత్తించే సాంగ్ కు కొన్ని మూమెంట్స్ చేసిన తర్వాత నాగార్జున తన పని మొదలు పెట్టాడు. ఫైనల్ సందర్భంగా బిగ్ బాస్ 3 జర్నీని వివరించాడు. ఈ షోలో తాను భాగమైనందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపాడు. బిగ్ బాస్ సీజన్ 3 ఇంత విజయవంతం కావడానికి ఈ షోలో పాల్గొన్న కంటెస్టెంట్స్, ప్రేక్షకుల ఆదరణే కారణం అని నాగార్జున తెలిపాడు. 

Bigg Boss 3: మాజీ కంటెస్టంట్స్ డాన్స్ లతో ఫినాలే స్టార్ట్

నాగార్జున కొంత సమయం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ తో ముచ్చటించారు. ఎలిమినేట్ అయిన సభ్యులు. బిగ్ బాస్ 3లో ఫైనల్స్ చేరిన సభ్యులు కుటుంబాలు ఫైనల్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా నాగార్జునతో హేమ, జాఫర్, హిమజ సరదాగా మాట్లాడారు. ఇంకా రవికృష్ణ, వితిక, మహేష్, శిల్పా చక్రవర్తి, పునర్నవి బిగ్ బాస్ హౌస్ లో తమ అనుభవాలని నాగార్జునతో పంచుకున్నారు. 

Bigg Boss3: నాగార్జున గ్రాండ్ ఎంట్రీ.. వాళ్ళిద్దరిలో ఎవరైనా ఓకే అంటున్న శివజ్యోతి

జాఫర్ మాట్లాడుతూ ప్రస్తుతం ఫైనల్స్ కు చేరిన ఐదుగురిలో బాబా భాస్కర్ తన ఫేవరెట్ అని తెలిపాడు. శివజ్యోతి మాట్లాడుతూ శ్రీముఖి, అలీ ఎవరు టైటిల్ గెలిచినా తనకు సంతోషమే అని తెలిపింది. పునర్నవి రాహుల్ తన ఫేవరెట్ అని తెలిపింది.