దాదాపు మూడున్నర నెలలుగా తెలుగు ప్రేక్షకులని అలరించిన బిగ్ బాస్ సీజన్ 3నేటితో ముగియబోతోంది. నవంబర్ 3 ఆదివారం రోజున బిగ్ బాస్ షో గ్రాండ్ ఫినాలే కు ముస్తాబైంది. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఐదుగురిలో ఎవరు విజేతగా నిలబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది. కాగా ప్రస్తుతం కలర్ ఫుల్ గా బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే జరుగుతోంది. అలీ రెజా తర్వాత మరో కంటెస్టెంట్ ఎలిమినేషన్ లో భాగంగా వరుణ్ సందేశ్ ఎలిమినేట్ అయ్యాడు. ఇది కొంచెం షాకింగే. 

మరో కంటెస్టెంట్స్ ని ఎలిమినేట్ చేయడానికి నాగార్జున మంచి ప్లాన్ వేశారు. దీని కోసం నాగార్జున వేదికపైకి గెస్ట్ గా వచ్చిన హీరో శ్రీకాంత్ ని ఆహ్వానించాడు. శ్రీకాంత్ కు ఒక సూట్కేస్ ఇచ్చి హౌస్ లోకి పంపారు. శ్రీకాంత్ తీసుకువచ్చిన సూట్కేస్ లో 10 లక్షలు ఉన్నాయి. ఆ డబ్బు తీసుకుని ఒకరు వెళ్లిపోవచ్చు అని ఆఫర్ ఇచ్చారు. అందుకు నలుగురు సభ్యులు నో చెప్పారు. 

Bigg Boss3: విన్నర్ అతడే అంటున్న అలీ!

మరో సూట్కేస్ తీసుకుని వచ్చి మొత్తం 20 లక్షలు బంపర్ ఆఫర్ ని నాగార్జున శ్రీకాంత్ ద్వారా ఇంటి సభ్యులకు ఇచ్చారు. ఈ ఆఫర్ కి కూడా నలుగురు సభ్యులు నో చెప్పారు. ప్లాన్ ఎ, ప్లాన్ బి వర్కౌట్ కాకపోవడంతో నాగార్జున ప్లాన్ సి అమలు చేశారు. 

Bigg Boss 3: రూ.20 లక్షల ఆఫర్.. షాకిచ్చిన హౌస్ మేట్స్!

ప్లాన్ సి లో భాగంగా హీరోయిన్ కేథరిన్ ఓ ఎన్వలప్ తీసుకుని హౌస్ లోకి ఎంటర్ అయింది. కేథరిన్ తీసుకుని వచ్చిన ఎన్వలప్ ని శ్రీకాంత్ ఓపెన్ చేశాడు. అందులో వరుణ్ సందేశ్ పేరు ఉంది. దీనితో వరుణ్ ఎలిమినేట్ అవుతున్నట్లు నాగార్జున ప్రకటించారు.