బిగ్ బాస్ సీజన్ 3 చివరి దశకి చేరుకుంది. టైటిల్ విన్నర్ ఎవరనే విషయం మరికాసేపట్లో తెలియనుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో రాహుల్‌ సిప్లిగంజ్‌ విన్నర్‌ అంటూ ప్రచారం జరుగుతోంది. ఆదివారం నాడు గ్రాండ్ ఫినాలే అంతే గ్రాండ్ గా మొదలైంది. భారీ స్థాయిలో భారీ ఏర్పాట్లతో షోని మొదలుపెట్టారు.

ముందుగా ఎలిమినేట్ అయిన కంటెస్టంట్స్అందరూ తమ డాన్స్ పెర్ఫార్మన్స్ తో షోని మొదలుపెట్టారు. హోస్ట్ నాగార్జున కూడా వారితో కలిసి చిందులేశారు. అనంతరం ఎలిమినేటెడ్ కంటెస్టంట్స్ తో టాప్ 5 కంటెస్టెంట్స్ఫ్యామిలీస్ తో మాట్లాడిన నాగార్జున మన టీవీ ద్వారా ఐదుగురు ఫైనలిస్ట్ లతో మాట్లాడారు. రాహుల్ ఓ పాట పాడాడు.

Bigg Boss3: విన్నర్ అతడే అంటున్న అలీ!

ఆ తరువాత కేథరిన్ త్రెసా తన పెర్ఫార్మన్స్ తో స్టేజ్ ని షేక్ చేసింది. ఆ తరువాత డైరెక్టర్ మారుతి, రాశిఖన్నా కలిసి హౌస్ లోకి వెళ్లి అలీ ఎలిమినేట్ అయినట్లు చెప్పారు. మిగిలిన నలుగురిలో మరొకరిని ఎలిమినేట్ చేయడానికి హీరో శ్రీకాంత్ ని తీసుకొచ్చారు.

స్టేజ్ పైకి వచ్చిన శ్రీకాంత్ బిగ్ బాస్ తన ఫేవరేట్ షో అని.. షూటింగ్ అయినా మానేస్తా కానీ బిగ్ బాస్ మాత్రం మాననని అన్నారు. బిగ్ బాస్ లో తన ఫేవరెట్ కంటెస్టంట్ పునర్నవి అని చెప్పారు. ఆ తరువాత శ్రీకాంత్ కి ఒక బాక్స్ ఇచ్చి హౌస్ లోకి పంపించారు. ఆ సూట్ కేస్ లో పది లక్షల క్యాష్ ఉందని, అది తీసుకొని ఎవరైనా వెళ్ళొచ్చని నాగార్జున హౌస్ మేట్స్ కి చెప్పారు.

కానీ హౌస్ మేట్స్ ఎవరూ కూడా దానికి అంగీకరించలేదు. ఆ తరువాత స్టోర్ రూమ్ నుండి మరో బాక్స్ తీసుకొచ్చారు. అందులో మరో పది లక్షలు ఉందని.. మొత్తం ఇరవై లక్షలు తీసుకొని ఎవరైనా వెళ్ళొచ్చని చెప్పారు. శ్రీకాంత్.. హౌస్ మేట్స్ కి వచ్చిన అదృష్టాన్ని కాదనకూడదని అన్నారు. దానికి కూడా హౌస్ మేట్స్ ఎవరూ ఒప్పుకోలేదు. ఇంకో సూట్ కేస్ వస్తే ఆలోచిస్తానని బాబా భాస్కర్ కామెడీ చేశారు.