దాదాపు మూడున్నర నెలలుగా తెలుగు ప్రేక్షకులని అలరించిన బిగ్ బాస్ సీజన్ 3నేటితో ముగియబోతోంది. నవంబర్ 3 ఆదివారం రోజున బిగ్ బాస్ షో గ్రాండ్ ఫినాలే కు ముస్తాబైంది. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఐదుగురిలో ఎవరు విజేతగా నిలబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొని ఉంది. కాగా ప్రస్తుతం కలర్ ఫుల్ గా బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే జరుగుతోంది. 

టాప్ 5 లో ఉన్న అలీ రెజా కొద్దిసేపటి క్రితమే ఎలిమినేట్ అయ్యాడు. సినీ దర్శకుడు మారుతి, రాశి ఖన్నా గెస్ట్ లుగా ఎంట్రీ ఇచ్చారు. టాప్ 5 లో ఒకరిని ఎలిమినేట్ చేసే బాధ్యతని నాగ్ వీరిద్దరికి అప్పగించాడు. ఎలిమినేట్ అయినా వ్యక్తి పేరున్న ఎన్వలప్ ని తీసుకుని రాశి, మారుతి హౌస్ లోకి వెళ్లారు. 

ఎన్వలప్ ని ఓపెన్ చేసి కొంత సమయం హౌస్ మేట్స్ ని టెన్షన్ పెట్టారు. చివరకు అలీ రెజా ఎలిమినేట్ అయినట్లు రాశి ఖన్నా ప్రకటించింది. దీనితో అలీ బిగ్ బాస్ వేదికపై ఉన్న నాగార్జున వద్దకు వెళ్ళాడు. హౌస్ లో ఇన్నిరోజులు గడిపినందుకు  తనకు చాలా సంతోషంగా ఉందని అలీ రెజా తెలిపాడు. పైగా రాశి ఖన్నా లాంటి ఏంజిల్ చేతిలో ఎలిమినేట్ కావడం తనకు చాలా సంతోషంగా ఉందని సరదాగా కామెంట్ చేశాడు. 

అలీ సతీమణి మాట్లాడుతూ నిన్ను చూసి గర్వపడుతున్నట్లు తెలిపింది. ఎలిమినేట్ అయి మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చి పోటీ ఇవ్వడం చాలా కష్టం. అయినా కూడా ఇక్కడవరకు చేరుకున్నందుకు గర్వపడుతున్నట్లు తెలిపింది. 

Bigg Boss3: బాత్రూం అంటే ఇష్టమన్న రాహుల్.. నాగ్ తో ఫన్నీగా బాబా!

ఇక మిగిలిన నలుగురిలో విజేత ఎవరు, 2,3, 4 స్థానాల్లో నిలిచేది ఎవరు అని నాగార్జున అలీని ప్రశ్నించాడు. దీనితో రాహుల్ టైటిల్ గెలుస్తాడని అలీ తెలిపాడు. రెండవ స్థానంలో శ్రీముఖి.. మూడు, నాలుగు స్థానాల్లో వరుణ్, బాబా ఉంటారని అలీ తెలిపాడు.