నందమూరి బాలకృష్ణ నటిస్తోన్న తాజాగా చిత్రం 'రూలర్'. దర్శకుడు కేఎస్ రవికుమార్ రూపొందిస్తోన్న ఈ సినిమా టీజర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. టీజర్ ఎలా ఉందనే సంగతి పక్కన పెడితే బాలయ్య లుక్ మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

మిగిలిన హీరోల సినిమాల సంగతి ఎలా ఉన్నా.. బాలయ్య సినిమా వస్తుందంటే ట్రోలర్స్ రెడీగా ఉంటారు. దానికి తగ్గట్లే బాలయ్య తన సినిమా ద్వారా వారికి కావల్సినంత కంటెంట్ ఇస్తున్నారు. తాజాగా విడుదలైన టీజర్ లో బాలయ్య గెటప్ పై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. అభిమానులు సైతం బాలయ్య గెటప్ తో అప్సెట్ అవుతున్నారు.

Jabardasth show : నేను 'జబర్దస్త్' చేయడం లేదు.. నాగబాబు కామెంట్స్!

ముఖ్యంగా పోలీస్ గెటప్ లో బాలయ్య కనిపించిన తీరు, ఆయన హెయిర్ స్టైల్, కళ్లజోడు ఇలా ప్రతీ ఎలిమినేట అభిమానులను నిరాశ పరిచిందనే చెప్పాలి. వయసు పెరగడంతో బాలయ్య ముఖంపై ముడతలు బాగా కనిపిస్తున్నాయి. మేకప్ తో వాటిని సరి చేయాల్సింది పోయి మరింత హైలైట్ అయ్యేలా చేశారు.

పోలీస్ యూనిఫాం, మధ్య పాపిడి, తలపై టోపీ ఇలా ఏ ఒక్కటి కూడా బాలయ్యకి సూట్ అవ్వలేదు. టీజర్ లో బాలయ్య పవర్ ఫుల్ గా కనిపిస్తాడనుకుంటే.. కామెడీ చేసి పడేశారు. దీంతో ఫ్యాన్స్ చిత్రబృందంపై మండిపడుతున్నారు. నిర్మాత సి.కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.

Ruler Teaser: ''ఇక వేటే..'' బాలకృష్ణ 'రూలర్' టీజర్!

'మీరు అసలు మనుషులేనా.. ఆ విగ్ ఏంటి దరిద్రంగా ఆ మాత్రం జాగ్రత్త తీసుకోలేరా..?' అంటూ ప్రశ్నిస్తున్నారు. 'పోలీస్ గెటప్ లో మా బాలయ్యని సర్వనాశనం చేశారు కదరా..' అంటూ మరో అభిమాని బాధ పడుతున్నాడు. మొత్తానికి బాలయ్య తన విగ్గుతో ఫ్యాన్స్ కి సైతం షాక్ ఇచ్చాడు.  వేదిక, సోనాలి చౌహన్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.