గత కొన్ని రోజులుగా 'జబర్దస్త్' షోకి సంబంధించి పలు వార్తలు వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ షో నుండి నాగబాబు తప్పుకుంటున్నట్లు.. అతడితో పాటు మరికొంతమంది కమెడియన్స్ కూడా జబర్దస్త్ షోని వదిలేయనున్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా ఈ విషయాలపై నాగబాబు స్పందించాడు.

తాను జబర్దస్త్ షో నుండి తప్పుకున్నట్లు అధికారికంగా ప్రకటించారు. శుక్రవారం నాటి ఎపిసోడ్ తరువాత తను ఇక జబర్దస్త్ షోలో కనిపించనని స్పష్టం చేశారు. వ్యాపారానికి సంబంధించిన అభిప్రాయబేధాల వలనే బయటకి వచ్చేశానని అంటున్నారు.

'జబర్దస్త్' షో వదిలేసిన నాగబాబు, హైపర్ ఆది, అనసూయ..? క్లారిటీ ఇచ్చిన అదిరే అభి!

తాను జబర్దస్త్ షో మానేయడానికి కారణమంటూ రకరకాల ఊహాగానాలు బయటకి వస్తున్నాయని.. ఆ మాటలు నచ్చక తనే స్వయంగా క్లారిటీ ఇస్తున్నట్లు చెప్పారు. శుక్రవారం నాటి ఎపిసోడ్ తరువాత తను ఇక జబర్దస్త్ షోలో కనిపించనని తెలిపారు. తనకు తానుగా షో నుండి తప్పుకునే పరిస్థితి వస్తుందని ఎప్పుడూ అనుకోలేదని.. కానీ ఆ పరిస్థితి వచ్చిందని.. వ్యాపారానికి సంబంధించిన సైద్ధాంతిక విభేదాల వలనే తను బయటకి వచ్చేసినట్లు వెల్లడించాడు. 

రెమ్యునరేషన్ విషయంలో వచ్చిన గొడవల వలనే తను జబర్దస్త్ షో నుండి బయటకి వెళ్లిపోయినట్లు ఎవరో ప్రశ్నించారని.. తనకు అసలు రెమ్యునరేషన్ ప్రామాణికం కాదని అన్నారు. ఉన్నంతలో తనకు మంచి రెమ్యునరేషన్ ఇచ్చారని.. కానీ అది తన స్థాయికి తగ్గ రెమ్యునరేషన్ కాదని అన్నారు.

అయినప్పటికీ తనకు అలాంటి ఇష్యూలు లేవని అన్నారు. ఇన్నాళ్లు జబర్దస్త్ చేయడానికి, ఇప్పుడు ఆ షో నుండి బయటకి రావడానికి రెమ్యునరేషన్ కారణం కాదని నాగబాబు తెలిపారు. 2013 ఫిబ్రవరి నుండి నాగబాబు ఈ షోకి జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ జర్నీ తనకు ఎంతో సంతోషాన్నిచ్చిందని అన్నారు.