నందమూరి బాలకృష్ణ హీరోగా కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో గతంలో 'జై సింహా' వచ్చింది. ఇప్పుడు మరోసారి ఇదే కాంబినేషన్‌లో కొత్త చిత్రం పట్టాలెక్కి షూటింగ్ జరుపుకుంటోంది. సి.కె.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సమర్పణలో హ్యాపీ మూవీస్‌ బ్యానర్‌లో సి.కల్యాణ్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'రూలర్‌' అనే టైటిల్ ఫైనల్ చేశారు. కొన్నిరోజుల క్రితం ఈ 
సినిమాకి సంబంధించిన పోస్టర్స్ కొన్ని బయటకి వచ్చి బాగా వైరల్ అయ్యాయి. తాజాగా ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు. 

సంక్రాంతి సినిమాలు.. రిలీజ్ డేట్లు ఫైనల్ అయినట్లే!

'ధర్మ.. మా ఊరికే గ్రామ దైవం.. ఎవరికి ఏం కష్టం వచ్చినా.. తనే ముందుంటాడు..' అనే డైలాగ్ తో టీజర్ మొదలైంది. ''ఒంటి మీద ఖాకి యూనిఫామ్ ఉంటేనే బోనులో పెట్టిన సింహంలా ఉంటాను. యూనిఫామ్ తీసానా బయటికి వచ్చిన సింహంలా ఆగను.. ఇక వేటే'' అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ హైలైట్ గా నిలిచింది. 

టీజర్ మొత్తం యాక్షన్ సన్నివేశాలతో నింపేశారు. వేదిక, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ సినిమాలో నటి భూమిక కీలకపాత్ర పోషిస్తోంది. ఈ చిత్రానికి పరుచూరి మురళి కథను అందిస్తున్నారు. చిరంతన్‌ భట్‌ బాణీలు సమకూరుస్తున్నారు.

రామ్‌ప్రసాద్‌ సినిమాటోగ్రఫీ. రామ్‌లక్ష్మణ్‌ యాక్షన్‌ కొరియోగ్రఫీ. చిన్నా ఆర్ట్‌ వర్క్‌ను అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.