మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కిన 'అల వైకుంఠపురములో' చిత్రం ఈ సంక్రాంతికి విడుదలైన సంగతి తెలిసిందే. నా పేరు సూర్య లాంటి ఫ్లాప్ మూవీ తర్వాత బన్నీ బంపర్ హిట్ కొట్టాడు. త్రివిక్రమ్ దర్శత్వం, అల్లు అర్జున్ వన్ మాన్ షో గా సాగిన అల వైకుంఠపురములో చిత్రం నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. 

ఈ సంధర్భంగా చిత్ర యూనిట్ మీడియా సమావేశం నిర్వహించింది. ఈ ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్, త్రివిక్రమ్ అనేక విశేషాలని పంచుకున్నారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఓ విలేఖరి.. అందరు హీరోలు అల వైకుంఠపురములో చిత్రంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మీ ఆప్త మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఈ చిత్రాన్ని చూశారా? చూస్తే ఏమని అభినందించారు అని త్రివిక్రమ్ ని ప్రశ్నించారు. 

ప్రభాస్ ఎంతో డబ్బు సంపాదించుకుని ఉండొచ్చు.. బాహుబలిపై అల్లు అర్జున్!

దీనికి త్రివిక్రమ్ తనదైన శైలిలో బదులిచ్చారు. 'పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఊపిరి సలపనంత రాజకీయాలతో బిజీగా ఉన్నారు. ఈ టైం లో సినిమాలు ఎలా చూస్తారు.. మరో విషయం ఏంటంటే ఆయన సినిమాలనే ఆయన చూసుకోరు.. ఎప్పుడూ మూడు నెలల తర్వాత చూడాలనిపిస్తే చూస్తారు. నేను బ్రతిమలాడితే అత్తారింటికి దారేది రిలీజైన 120 రోజుల తర్వాత ఆ చిత్రాన్ని చూశారు. ఇలా అల వైకుంఠపురములో చిత్రాన్ని ఆయన 3 నెలల లోపు చూడాలంటే అద్భుతం జరగాలి అని త్రివిక్రమ్ సరదాగా అన్నారు. 

రాత్రి 11:30కి ఎన్టీఆర్ ఫోన్.. అల్లు అర్జున్, త్రివిక్రమ్ కామెంట్స్!

పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో నటిస్తున్నప్పటికీ ఆయన మొదటి ప్రాధాన్యత రాజకీయాలే అని త్రివిక్రమ్ తెలిపారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పింక్ తెలుగు రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.