స్టైలిష్ స్టార్  అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో చిత్రం ఆదివారం రోజు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఓవర్సీస్ లో ప్రీమియర్ షోలు పడ్డాయి. ప్రీమియర్ షోల నుంచి ఈ చిత్రానికి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. సంక్రాంతికి అసలు సిసలైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటూ అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. 

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరోమారు తన పెన్ను పవర్ చూపించాడని అంటున్నారు. హాస్యం, ఎమోషన్, ఫ్యామిలీ డ్రామా పర్ఫెక్ట్ గా మిక్స్ చేసిన కథలో అల్లు అర్జున్ చెలరేగిపోయి నటించాడు. ఎప్పటిలాగే త్రివిక్రమ్ డైలాగులకు మంచి రెస్పాన్స్ వస్తోంది. తమన్ సంగీతంతో అదరగొట్టాడు. 

'అల.. వైకుంఠపురములో' ట్విట్టర్ రివ్యూ.. ఆ ఎపిసోడ్స్ అదిరిపోయాయి!

డిఫెరెంట్ గా తెరకెక్కించిన యాక్షన్ ఎపిసోడ్స్, ఓ మైగాడ్ డాడీ సాంగ్ లో బన్నీ డాన్స్, పూజా హెగ్డే, నివేత పేతురాజ్ గ్లామర్ సినిమాకు బోనస్ అని అంటున్నారు. త్రివిక్రమ్ నుంచి ఇప్పటివరకు వచ్చిన చిత్రాల్లో ఇది బెస్ట్ మూవీ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. 

'అల..వైకుంఠపురములో' ప్రీమియర్ షో టాక్.. మాటల బుల్లెట్స్ పేలాయి!

నా పేరు సూర్య చిత్రం తర్వాత బన్నీ లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. ఆ సమయంలో అభిమానుల నుంచి ఎదురవుతున్న ప్రశ్నలకు బన్నీ స్పందించాడు. మీకు ఒక అద్భుతమైన చిత్రం అందించడం కోసం గ్యాప్ తీసుకుంటున్నాను. తప్పకుండా ఒక మంచి చిత్రంతో మీ ముందుకు వస్తా అని అల్లు అర్జున్ ఆ సమయంలో అభిమానులకు తెలియజెప్పాడు. అందుకు తగ్గట్లుగానే ఇప్పుడు అల వైకుంఠపురములో చిత్రంతో బన్నీ తన మాట నిలబెట్టుకున్నాడు.