Asianet News TeluguAsianet News Telugu

'అల..వైకుంఠపురములో' ప్రీమియర్ షో టాక్.. మాటల బుల్లెట్స్ పేలాయి!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ హ్యాట్రిక్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం అల.. వైకుంఠపురములో. టైటిల్ వినిగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ మరో క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల కోసం సిద్ధం చేస్తున్నాడని అనిపించింది.

Allu Arjun's Ala Vaikunthapurramuloo movie Premier Show Talk
Author
Hyderabad, First Published Jan 11, 2020, 11:42 PM IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ హ్యాట్రిక్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం అల.. వైకుంఠపురములో. టైటిల్ వినిగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ మరో క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల కోసం సిద్ధం చేస్తున్నాడని అనిపించింది. ట్రైలర్, టీజర్ చూడగానే త్రివిక్రమ్ టేకింగ్ కు అల్లు అర్జున్ స్టైల్ తోడైందని.. సినిమా తప్పకుండా విజయం సాదిస్తుందని తెలుగు సినీ ప్రేక్షకులు భావించారు. 

సంక్రాంతి కానుకగా అల.. వైకుంఠపురములో చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ఆదివారం రోజు ఈ చిత్రం విడుదల కానుండగా.. శనివారమే యుఎస్ లో ప్రీమియర్ షోలు ప్రారంభమయ్యాయి. ప్రీమియర్ షోల నుంచి ఈ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో తెలుసుకుందాం. 

సమ వయస్కులుగా అల్లు అర్జున్, సుశాంత్ బాల్యం నుంచి ఈ చిత్ర కథ మొదలవుతుంది. అల్లు అర్జున్ మిడిల్ క్లాస్ కుర్రాడిగా.. సుశాంత్ ధనవంతుడిగా పెరుగుతారు. ఈ సన్నివేశాలని త్రివిక్రమ్ చక్కగా చిత్రీకరించారు. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్, ఫన్ ఎలిమెంట్స్, మంచి పాటలతో ఫస్ట్ హాఫ్ సరదాగా సాగిపోతుంది. మురళి శర్మ, అల్లు అర్జున్ మధ్య వచ్చే ప్రీ ఇంటర్వెల్ సన్నివేశం సెకండ్ హాఫ్ పై ఆసక్తిని పెంచుతుంది. 

ఫస్ట్ హాఫ్ లో కథ ఎక్కువగా ఉన్నట్లు అనిపించదు. కానీ త్రివిక్రమ్ తన రచనతో, అల్లు అర్జున్ పెర్ఫామెన్స్ తో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేశారు. అల్లు అర్జున్, మురళి శర్మ మధ్య వచ్చే ఇంటర్వెల్ సీన్ లో తమన్ అద్భుతమైన బ్యాగ్రౌండ్ సంగీతం అందించాడు. అప్పటివరకు సరదాగా సాగిన కథ ఒక్కసారిగా ఎమోషనల్ గా మారుతుంది. 

సెకండ్ హాఫ్ లో అసలు కథ మొదలైన తర్వాత కూడా మంచి కామెడీ పండింది. వెన్నెల కిషోర్, సునీల్ కామెడీ సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. సెకండ్ హాఫ్ లో టబు, జయరాం మధ్య కీలకమైన ఎమోషనల్ సీన్స్ ఆకట్టుకుంటాయి. కథ పరంగా కొన్ని సన్నివేశాలని త్రివిక్రమ్ సాగదీసినట్లు అనిపించింది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ప్రస్తావన కూడా ఉంది. ప్రేక్షకుల ఆ సన్నివేశాల్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. 

'అల.. వైకుంఠపురములో' బంక్ శీను కాదు.. అంతకు మించి!

సెకండ్ హాఫ్ లో త్రివిక్రమ్ పూర్తి కథని రివీల్ చేసే విధానం.. ఆ సన్నివేశాల్లో బన్నీ నటన అదుర్స్ అనిపించాయి. ఓవరాల్ గా త్రివిక్రమ్ మరోసారి తన పెన్నుతో బులెట్స్ పేల్చాడని ఆడియన్స్ అంటున్నారు. యాక్షన్ ఎపిసోడ్స్ డిఫెరెంట్ గా అనిపిస్తాయి. సినిమాటోగ్రఫీ కూడా చక్కగా కుదిరింది. సూపర్ హిట్ సాంగ్స్ ఇవ్వడం మాత్రమే కాదు.. అద్భుతమైన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో తమన్ ఈ కథకు ప్రాణం పోశాడు. హీరోయిన్లు పూజా హెగ్డే, నివేత గ్లామర్ కూడా బాగా ప్లస్ అయింది. 

అల వైకుంఠపురం సాంగ్ పై ట్విస్ట్ ఇచ్చిన ప్రభాకర్ జైనీ

ఓవరాల్ గా క్లాస్, మాస్ మిక్స్ చేసిన ఈ చిత్రం పండక్కి మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని ఆడియన్స్ అంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. 

Follow Us:
Download App:
  • android
  • ios