ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీరావు గురువారం రోజు మృతి చెందిన సంగతి తెలిసిందే. అనారోగ్యం కారణంగా మారుతీ రావు చెన్నైలో చికిత్స పొందుతూ కన్ను మూశారు. మారుతీరావు మృతి చెందడంతో గొప్ప నటుడిని కోల్పోయామని టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. టాలీవుడ్ సినీ ప్రముఖులు మారుతిరావు మృతిపై సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. 

సూపర్ స్టార్ మహేష్ బాబు మారుతీరావు మృతిపై విషాదం వ్యక్తం చేశాడు. 'మారుతీరావు గారి మృతి నాన్ని తీవ్రంగా బాధించింది. తెలుగు సినిమాలు ఆయన చేసిన సేవలు అద్భుతం. మనం ఒక రత్నాన్ని కోల్పోయాం. ఆయన కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు నా ప్రఘాడ సానుభూతి తెలియజేస్తున్నా. మారుతీరావు ఆత్మకు శాంతి చేకూరాలి' అని మహేష్ బాబు ట్వీట్ చేశారు. మురారి చిత్రంలో మహేష్ బాబుతో కలసి మారుతీరావు నటించారు. 

స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి సోషల్ మీడియాలో మారుతీ రావు మృతి పట్ల విచారం వ్యక్తం చేసింది. అనుష్క, మారుతీరావుతో కలసి సైజు జీరో చిత్రంలో నటించింది. ఆ మెమొరీస్ ని గుర్తు చేసుకుంది. 'మారుతీరావు గారి మృతి తీవ్ర విషాదాన్ని కలిగించింది. నటుడిగా, రచయితగా అయన తెలుగు సినిమాకు చేసిన సేవలు ఎప్పటికి నిలిచి ఉంటాయి. ఆయన కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలియజేస్తున్నా' అని అనుష్క సోషల్ మీడియాలో పేర్కొంది. 

'నా అభిమాన నటుల్లో గొల్లపూడి మారుతీరావు కూడా ఒకరు. ఆయన నటన, మాటలు నాకు చాలా దగ్గరగా అనిపిస్తాయి. మిమ్మల్ని మేము ఎప్పటికి గుర్తుంచుకుంటాం సర్' అని నాని ట్వీట్ చేశాడు. 

'గొల్లపూడి మారుతిరావుగారి మృతి పట్ల అయన కుటుంబ సభ్యులకు ప్రఘాడ సానుభూతి తెలియజేస్తున్నాం. సినిమా కుటుంబంలో ఆయన సభ్యుడిగా ఓ వెలుగు వెలిగారు.. అందరి ప్రేమని పొందారు. ఆయన సేవల్ని చిత్ర పరిశ్రమ ఎప్పటికి గుర్తుంచుకుంటుంది'. -- అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ

'తెలుగు చిత్ర పరిశ్రమకు తీరని లోటు. గొల్లపూడి మారుతీరావుగారి ఆత్మకు శాంతి చేకూరాలి. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రఘాడ సానుభూతి'. -- హీరో నితిన్ 


 

గొల్లపూడి జీవితంలో విషాద ఘటన.. అజిత్ తో సినిమా తీస్తూ కుమారుడి మృతి 

గొల్లపూడి మృతి: మెగాస్టార్ సూపర్ హిట్ తో ఎంట్రీ.. ఆరు నందులు కైవసం!

Gollapudi Maruthi rao: చిరంజీవి పాత్ర నేను చేసుంటే బాగుండేదని.. గొల్లపూడి