టాలీవుడ్ హీరోయిన్ ఛార్మి గత కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉంటున్నారు. కానీ ఆమె సినిమాని మాత్రం విడిచిపెట్టలేదు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తో కలసి ఛార్మి వరుసగా సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. పూరి జగన్నాధ్ దర్శత్వంలో తెరకెక్కే చిత్రాలకు ఛార్మి నిర్మాణ భాగస్వామిగా ఉంటోంది. 

ప్రస్తుతం వీరి కాంబోలో విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ చిత్ర షూటింగ్ జరుగుతోంది. ఇస్మార్ట్ శంకర్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పూరి దర్శకత్వంలో తెరక్కుతున్న చిత్రం కావడంతో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక ఆదివారం రోజు షూటింగ్ కు విరామం దొరకడంతో ఛార్మి తన పెంపుడు కుక్కలతో సరదాగా గడిపింది. 

తన ఇంటికి వచ్చిన కొత్త ఫ్రెండ్ అంటూ పెంపుడు కుక్కని ముద్దుల్లో ముంచెత్తుతోంది. ఛార్మిని చూడగానే ఆ పెంపుడు కుక్కలు రెండూ పరుగున ఆమె వద్దకు వెళ్లాయి. ఈ క్యూట్ వీడియో ప్రస్తుతం నెటిజన్లని ఆకట్టుకుంటోంది. ఛార్మి పోస్ట్ చేసిన ఫొటోస్ కూడా చాలా క్యూట్ గా ఉన్నాయి. 

జీవితాంతం నాకు ప్రేమని అందించే నేస్తాలు అంటూ ఛార్మి కామెంట్ పెట్టింది. ఛార్మి సహజంగానే జంతు ప్రేమికురాలు. ఛార్మి ఇంట్లో పెంపుడు కుక్కలతో పాటు అనేక రకాల పక్షులు కూడా ఉంటాయి. వాటి దృశ్యాలని ఛార్మి తరచుగా సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది. 

అల్లు అరవింద్ చేయి పడితే ఇక అంతే.. ఈ హీరోల కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్

హీరో శ్రీకాంత్ కుటుంబంలో విషాదం!