అల్లు అరవింద్ చేయి పడితే ఇక అంతే.. ఈ హీరోల కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్స్

First Published 17, Feb 2020, 9:35 AM IST

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ప్లానింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతల్లో అల్లు అరవింద్ ఒకరు. కథ ఎంపికలో అల్లు అరవింద్ జడ్జిమెంట్ 100 శాతం ఫలితాన్ని ఇస్తుంది. ఇక సినిమా ప్రేక్షకులకు చేరేలా తనదైన శైలిలో ప్రమోషనల్ స్ట్రాటజీ అవలంభిస్తారు. అందుకే అల్లు అరవింద్ నిర్మాణంలో తెరకెక్కిన కొన్ని చిత్రాలు ఆయా హీరోల కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ గా నిలిచాయి. 

పసివాడి ప్రాణం: మెగాస్టార్ చిరంజీవి, విజయశాంతి జంటగా నటించిన పసివాడి ప్రాణం చిత్రం అల్లు అరవింద్ నిర్మాణంలో తెరకెక్కింది. ఈ చిత్రం ఆ సమయానికి చిరంజీవి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ మాత్రమే కాదు.. ఇండస్ట్రీ హిట్ గా కూడా నిలిచింది.

పెళ్లి సందడి: ఈ చిత్రానికి అల్లు అరవింద్ సహ నిర్మాతగా వ్యవహరించారు. శ్రీకాంత్ కెరీర్ లో ఇది ఆ టైంకి బిగ్గెస్ట్ హిట్.

పెళ్ళాం ఊరెళితే: ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకుడు. వేణు, శ్రీకాంత్ కెరీర్ లో ఈ మూవీ సూపర్ హిట్ గా నిలిచింది.

జల్సా: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన ఈ చిత్రం గీత ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కింది. హిట్ కోసం ఎదురుచూస్తున్న పవన్ కు ఈ చిత్రం ఊరటనిచ్చింది. అప్పటికి పవన్ కెరీర్ లో వసూళ్ల పరంగా ఇదే బిగ్ హిట్.

మగధీర: రాజమౌళి దర్శత్వంలో రాంచరణ్ హీరోగా తెరకెక్కిన దృశ్యకావ్యం ఈ చిత్రం. అల్లు అరవింద్ సాహసోపేతంగా అప్పటికి టాలీవుడ్ లో మరే చిత్రానికి ఖర్చు చేయనంతగా బడ్జెట్ పెట్టారు. ఈ చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికి తెలిసిందే.

గజినీ(అమీర్ ఖాన్) : బాలీవుడ్ లో కూడా అల్లు అరవింద్ జయకేతనం ఎగురవేశారు. అమిర్ ఖాన్ తో తెరకెక్కించిన గజినీ చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది.

భలే భలే మగాడివోయ్ : యువీ క్రియేషన్స్, గీత ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిన భలే భలే మగాడివోయ్ చిత్రం నాని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్.

గీత గోవిందం: ఇక రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం చిత్రం కూడా గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే తెరకెక్కింది. సింపుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద 70 కోట్ల వరకు షేర్ కొల్లగొట్టింది.

ప్రతిరోజూ పండగే : మారుతి దర్శత్వంలో, సాయిధరమ్ తేజ్ హీరోగా నటించిన ప్రతిరోజూ పండగే చిత్రం గత ఏడాది విడుదలయింది. ఈ చిత్రం కూడా గీతా ఆర్ట్స్, యువీ క్రియేషన్స్ బ్యానర్ లో తెరకెక్కింది. దాదాపు 35 కోట్ల షేర్ రాబట్టిన ఈ చిత్రం సాయిధరమ్ తేజ్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్.

అల వైకుంఠపురములో: ఈ చిత్రం గురించి అందరికి తెలిసిందే. సంక్రాంతికి విడుదలై వసూళ్ల సునామి సృష్టించింది. ఏకంగా నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ రికార్డుని సొంతం చేసుకుంది. బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కిన హ్యాట్రిక్ చిత్రం ఇది.

loader