Asianet News TeluguAsianet News Telugu

హీరో శ్రీకాంత్ కుటుంబంలో విషాదం!

టాలీవుడ్ హీరో శ్రీకాంత్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. శ్రీకాంత్ తండ్రి పరమేశ్వరరావు గత అర్థరాత్రి ( ఆదివారం 11 గంటల 45 నిమిషాలకు) కన్నుమూశారు.

Tollywood Hero Srikanth father dies
Author
Hyderabad, First Published Feb 17, 2020, 8:28 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

టాలీవుడ్ హీరో శ్రీకాంత్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. శ్రీకాంత్ తండ్రి పరమేశ్వరరావు గత అర్థరాత్రి ( ఆదివారం 11 గంటల 45 నిమిషాలకు) కన్నుమూశారు. శ్రీకాంత్ టాలీవుడ్ దశాబ్దాల కాలంగా నటుడిగా కొనసాగుతున్నాడు. 

శ్రీకాంత్ తండ్రి పరమేశ్వర రావు అనారోగ్య కారణాలతోనే మృతి చెందినట్లు తెలుస్తోంది. గత నాలుగు నెలలుగా పరమేశ్వరరావు ఊపిరిత్తితులకు సంబంధించిన వ్యాధితో భాదపడుతున్నారు. స్టార్ హాస్పిటల్స్ లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. పరమేశ్వరరావు కృష్ణా జిల్లా లోని మేకవారిపాలెం. 1948 మార్చి 16న పరమేశ్వరరావు జన్మించారు. 

కొంత కాలానికి పరమేశ్వరరావు కర్ణాటకలోని గంగావతి జిల్లాకు వలస వెళ్లారు. పరమేశ్వరరావు సతీమణి ఝాన్సీ లక్ష్మీ. హీరో శ్రీకాంత్, అనిల్, నిర్మలలు ఆయనకు సంతానం. 

నేటి మధ్యాహ్నం మహా ప్రస్థానంలో పరమేశ్వరరావు అంతక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios