ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి వకీల్ సాబ్, లాయర్ సాబ్ అనే టైటిల్స్ పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఈ చిత్ర అప్డేట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇటీవల WeWantPSPK26Update అనే హ్యాష్ ట్యాగ్ తో ట్రెండ్ కూడా చేశారు. 

కానీ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ, దిల్ రాజు మాత్రం స్పందించడం లేదు. తాజాగా ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న తమన్ ఆసక్తికర ప్రకటన చేశాడు. పవన్ కళ్యాణ్ ని కలసిన తర్వాత తమన్ ఈ ప్రకటన చేయడం విశేషం. పవన్ ని కలసిన తమన్ ట్విట్టర్ లో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. 

ఆ విషయంలో బాలయ్య, ట్రంప్ కిరాక్ అంతే.. కాపీ కొట్టడం అసాధ్యం!

'ఇది అద్భుతమైన రోజు. నేను కలవాలని, ఆయన చిత్రాలకు సంగీతం అందించాలని కలలు కన్న వ్యక్తిని కలిశాను. నేను కంపోజ్ చేసిన పాటలని ఆయనకు వినిపించాను. ఆ సమయంలో టెన్షన్ కు గురయ్యా. ఆయనపై ఉన్న ప్రేమ నేను ఒత్తిడికి గురయ్యేలా చేసింది. కానీ ఆయన కూడా నాపై ప్రేమాభిమానాలు చూపించారు. త్వరలోనే ఫస్ట్ సింగిల్ తో రాబోతున్నాం' అని తమన్ ప్రకటించాడు. 

వేణు శ్రీరామ్ దర్శత్వంలో తెరక్కుతున్న ఈ చిత్రాన్ని మేలో రిలీజ్ చేసేందుకు దిల్ రాజు సన్నాహకాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో పవన్ లాయర్ గెటప్ లో కనిపించబోతున్నాడు. నివేత థామస్, అంజలి కీలక పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. 

పవన్ కళ్యాణ్ ని కలిసిన నితిన్, భీష్మ డైరెక్టర్.. దిల్ రాజు వల్లే(ఫోటోస్)