అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సతీ సమేతంగా భారత పర్యటనకు విచ్చేసిన సంగతి తెలిసిందే. ఇండియాలో ట్రంప్ పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. ట్రంప్ పర్యటనపై దేశవ్యాప్తంగా సందడి నెలకొంది. ఇక ప్రజల్లో, రాజకీయ నాయకుల్లో ట్రంప్ పర్యటనపై ఆసక్తి నెలకొంది. ఈ ఉదయం అహ్మదాబాద్ లో ట్రంప్ కి ఘనస్వాగతం లభించిన సంగతి తెలిసిందే. 

సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు నమస్తే ట్రంప్ అనే హ్యాష్ ట్యాగ్ తో స్వాగతం పలికారు. మొదట ట్రంప్ అహ్మదాబాద్ లో దిగగానే సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. అనంతరం మొతేరా స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోడీ తో కలసి ప్రసంగించారు. 

అనంతరం ట్రంప్, మెలానియా దంపతులు ఆగ్రాలో తాజ్ మహల్ ని సందర్శించారు. గైడ్ ని అడిగి తాజ్ మహల్ విశేషాలు తెలుసుకున్నారు. అక్కడ విజిటర్స్ బుక్ లో ట్రంప్ తాజ్ మహల్ అనుభూతులని పంచుకున్నాడు. ఇక చివర్లో ట్రంప్ చేసిన సంతకం ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ట్రంప్ సంతకాన్ని నెటిజన్లు నందమూరి బాలకృష్ణ సంతకంతో పోల్చుతున్నారు. 

ఇలా రెచ్చిపోతోందేంటి.. షాకిస్తోన్న హీరోయిన్ బోల్డ్ ఫోటో షూట్

ట్రంప్ సంతకం విచిత్రంగా ఉంటూ నెటిజన్లని ఆకర్షిస్తోంది. ఇక బాలయ్య సంతకం కూడా దాదాపుగా అలాగే ఉంది. ప్రపంచంలో ఎవరి సంతకాన్ని అయినా ఫోర్జరీ, కాపీ చేయొచ్చేమో కానీ బాలయ్య, ట్రంప్ సంతకాలని కాపీ కొట్టడం అసాధ్యం అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

సమంత ఫ్లాప్ షో అంటూ కామెంట్స్ .. విరుచుకుపడ్డ అదితి రావు హైదరి