జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అటు సినిమాలు, ఇటు రాజకీయాలతో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. అజ్ఞాతవాసి చిత్రం తర్వాత పవన్ మరోసారి వెండితెరపై కనిపించలేదు. దీనితో పవన్ కళ్యాణ్ రీఎంట్రీ చిత్రం కోసం అభిమానులంతా ఎదురుచూస్తున్నారు. 

పవన్ ప్రస్తుతం బాలీవుడ్ లో ఘనవిజయం సాధించిన పింక్ చిత్ర రీమేక్ లో నటిస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శత్వంలో, దిల్ రాజు నిర్మాణంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అదే విధంగా క్రిష్ దర్శత్వంలో కూడా పవన్ నటిస్తున్నారు. తాజాగా పవర్ స్టార్ ని ఆయన వీరాభిమాని నితిన్, భీష్మ చిత్ర దర్శకుడు వెంకీ కుడుముల కలిశారు. 

పవన్ కళ్యాణ్ కు నితిన్ వీరాభిమాని అనే సంగతి తెలిసిందే. నితిన్, వెంకీ కుడుముల కాంబోలో తెరకెక్కిన భీష్మ చిత్రం ఇటీవల విడుదలై ఘనవిజయం దిశగా దూసుకుపోతోంది. దీనితో పవన్ కళ్యాణ్.. నితిన్ ని, దర్శకుడు వెంకీ కుడుములని, భీష్మ చిత్ర యూనిట్ ని అభినందించారు.

పవన్ కళ్యాణ్ ని కలవడంతో నితిన్ తన సంతోషాన్ని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. పవర్ స్టార్ భీష్మ చిత్ర యూనిట్ ని అభినందించారు. ఈ సంతోషం వెలకట్టలేనిది అని నితిన్ ట్వీట్ చేశాడు. నితిన్, వెంకీ కుడుములతో పాటు భీష్మ నిర్మాత నాగ వంశి కూడా పవన్ కలిశారు. 

వెంకీ కుడుముల కూడా పవన్ ని కలిశాక తన సంతోషాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. నా జీవితంలో అత్యంత సంతోషాన్నిచ్చే మూమెంట్ ఇది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు భీష్మ చిత్రం సక్సెస్ సాధించినందుకు అభినందనలు తెలిపారు అని వెంకీ కుడుముల ట్వీట్ చేశాడు. దిల్ రాజు గారి వల్ల పవన్ కళ్యాణ్ గారిని కలిసే అవకాశం వచ్చిందని వెంకీ కుడుముల తెలిపాడు. 

 

నితిన్, రష్మిక జంటగా నటించిన భీష్మ చిత్రం గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే హిట్ టాక్ సొంతం చేసుకున్న భీష్మ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది.