యంగ్ హీరో నితిన్ ఎట్టకేలకు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ లో ఒకరైన నితిన్ పెళ్లి గురించి చాలా కాలంగా చర్చ జరుగుతోంది. కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి ఉన్నప్పటికీ నితిన్ ఎప్పటికప్పుడు పెళ్లిని వాయిదా వేస్తూ వస్తున్నాడు. 

ఈ ఏడాది ఏప్రిల్ లో నితిన్ వివాహానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అతి త్వరలోనే నితిన్ నిశ్చితార్థం జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఎంబీఏ గ్రాడ్యుయేట్ అయిన షాలిని అనే యువతితో చాలా కాలంగా నితిన్ ప్రేమలో ఉన్నాడు. ఇరు కుటుంబ సభ్యులు వీరి ప్రేమకు అంగీకారం తెలపడంతో పెళ్లి భాజాలు మోగుతున్నాయి. 

దుబాయ్ లో కొద్ది మంది బంధు మిత్రుల సమక్షంలో నితిన్ వివాహం ప్రైవేట్ వేడుకగా జరగనుంది. ఇక వివాహం అనంతరం హైదరాబాద్ లో గ్రాండ్ రిసెప్షన్ జరగనుంది. ఈ రిసెప్షన్ కు నితిన్ టాలీవుడ్ చిత్రపరిశ్రమ మొత్తాన్ని ఆహ్వానించనున్నాడు. చాలా రోజులుగా నితిన్ పెళ్ళి గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ నితిన్ ఎప్పుడూ తన వ్యక్తిగత విషయాలని మీడియాతో పంచుకోడు. 

రానాతో క్రేజీ డైరెక్టర్ పవర్ ఫుల్ మూవీ.. RRR టైటిల్ ఫిక్స్?

సినిమాల విషయానికి వస్తే నితిన్ ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శత్వంలో భీష్మ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత నితిన్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో, చంద్రశేఖర్ యేలేటి దర్శత్వంలో నటించాల్సి ఉంది.