దక్షిణాదిలో హీరోయిన్ నయనతార తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. వయసు పెరిగే కొద్దీ నయన్ క్రేజ్ కూడా పెరుగుతోంది. దక్షిణాదిలో నయనతార లేడీ సూపర్ స్టార్. అందులో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం సౌత్ లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్ నయనతారనే. 

స్టార్ హీరోలతో సమానంగా ఆమె పారితోషికం ఉంటోంది. నటనలో నయనతారకు తిరుగులేదు. కానీ ఆమె యాటిట్యూడ్ విషయంలోనే సమస్యలు తలెత్తుతున్నాయి. పారితోషికం తీసుకున్నామా.. సినిమాలో నటించామా.. అంతవరకే తన పని అని నయన్ అంటుంది. 

సినిమా ప్రమోషన్స్ కు నయనతార హాజరు కాదు. తాను నటించింది రజనీకాంత్, చిరంజీవి లాంటి అగ్ర హీరోల సినిమా అయినా సరే నయనతార ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉంటుంది. ఇన్ని కండిషన్స్ పెట్టినా ఆమెకు ఉన్న క్రేజ్ దృష్ట్యా భారీ పారితోషికం ఇచ్చి మరీ దర్శమ నిర్మాతలు తమ చిత్రాల్లో నయన్ ని ఎంపిక చేసుకుంటుంటారు. 

ప్రచార కార్యక్రమాలకు హాజరు కావడం లేదని నయన్ పై దర్శక నిర్మాతలు కోపం ఉన్నప్పటికీ ఏమీ చేయలేని పరిస్థితి. తమలో అణుచుకున్న కోపాన్ని తమిళ దర్శక నిర్మాతలు ఇప్పుడిప్పుడే బయటకు తీస్తున్నారు. 

నయనతార ఇటీవల ఓ టివి ఛానల్ నిర్వహించిన అవార్డుల కార్యక్రమానికి హాజరైంది. దీనితో ఆమెపై విమర్శల గళం పెరుగుతోంది. ఈ సంఘటనతో నయన్ నిజస్వరూపం బయటపడిందని దర్సక నిర్మాతలు అంటున్నారు. నయనతారకు అవార్డు అందుకునేందుకు, వ్యక్తిగత ప్రచారం చేసుకునేందుకు సమయం ఉంటుంది కానీ.. ఆమె నటించిన సినిమాలకు ప్రచారం కల్పించేందుకు మాత్రం తీరిక ఉండదా అని నిర్మాతలు ప్రశ్నిస్తున్నారు. 

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో సినిమా.. ఏమైనా జరగొచ్చు!

నిర్మాత నుంచి కోట్లాది రూపాయలు తీసుకున్నప్పుడు ఆ చిత్రానికి ప్రచారం కల్పించే భాద్యత కూడా నటీనటులకు ఉంటుంది. సూపర్ స్టార్ రజనీకాంత్, ఇళయదళపతి విజయ్ లాంటి అగ్ర హీరోలు కూడా బాధ్యతగా తమ చిత్రాల కోసం ప్రమోషన్స్ చేస్తారు. నయనతార వాళ్ళకంటే ఎక్కువా అనే విమర్శలు వినిపిస్తున్నాయి. 

బాలయ్యతో వర్కౌట్ కాలేదు.. కనీసం చిరంజీవితో అయినా..

ఈ వ్యవహారం నడిగర్ సంఘం వరకు వెళ్లిందట. నయనతార సినిమా ప్రచారాల్లో పాల్గొనకపోతే ఆమె పారితోషికంతో కోత విధించేలా చర్యలు తీసుకోవాలని నిర్మాతలు డిమాండ్ చేస్తున్నారు.