నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన పటాస్ చిత్రంతో అనిల్ రావిపూడి దర్శకుడిగా మారాడు. ఆ చిత్రం సూపర్ హిట్ కావడంతో అనిల్ రావిపూడి వరుసగా క్రేజీ ఆఫర్స్ వచ్చాయి. సుప్రీం, రాజా ది గ్రేట్ చిత్రాలతో దర్శకుడిగా తన స్థాయిని పెంచుకున్నాడు. 

గత ఏడాది వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన ఎఫ్2 చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. అనిల్ రావిపూడి ఈ చిత్రంలో క్రియేట్ చేసిన ఫన్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. దీనితో ఈ దర్శకుడు ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబుని డైరెక్ట్ చేసే ఛాన్స్ దక్కించుకున్నాడు. అలా అనిల్ రావిపూడి, మహేష్ కాంబోలో సరిలేరు నీకెవ్వరు చిత్రం తెరకెక్కింది. 

సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కు రెడీ అవుతోంది. దీనితో చిత్ర యూనిట్ మొత్తం ప్రస్తుతం ప్రచార కార్యక్రమాలతో బిజీగా గడుపుతున్నారు. అనిల్ రావిపూడి ఓ ఇంటర్వ్యూలో తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

గతంలో అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటించబోతున్నాడు అంటూ వార్తలు వచ్చాయి. దీనిపై అనిల్ రావిపూడి స్పందిస్తూ ఆ సమయంలో బాలకృష్ణ బిజీగా ఉండడం వల్ల ఆ చిత్రం కుదరలేదని వ్యాఖ్యానించాడు. ఇక అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవిపై కూడా అభిమానాన్ని కురిపిస్తున్నాడు. సరిలేరు ప్రీరిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చీఫ్ గెస్ట్ గా హాజరైన సంగతి తెలిసిందే. 

బన్నీకి కళ్యాణ్ రామ్ థాంక్స్.. గోలలో కూడా ఆ మాట మరచిపోని ఎన్టీఆర్!

చిరంజీవితో భవిష్యత్తులో సినిమా ఉంటుందా అని ప్రశ్నించగా.. ఆయన ఊ అంటే ఎంతసేపు.. మూడు నాలుగు నెలల్లో కథ రాసేస్తా అని సమాధానం ఇచ్చాడు. సరిలేరు నీకెవ్వరు చిత్రం తర్వాత హిందీలో ఎఫ్2 రీమేక్ చేయమని అడుగుతున్నారు. ఎఫ్2 సీక్వెల్ కోసం కూడా కథ రాయాల్సి ఉంది. ఇప్పటికైతే తన తదుపరి చిత్రం గురించి కచ్చితమైన నిర్ణయం తీసుకోలేదని అనిల్ చెప్పుకొచ్చాడు.