నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం 'ఎంత మంచివాడవురా'. శతమానం భవతి ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. కళ్యాణ్ రామ్ కు జోడిగా మెహ్రీన్ నటించింది. పల్లెటూరి నేపథ్యంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం జనవరి 15న రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. 

బుధవారం రోజు జరిగిన ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్ కు కళ్యాణ్ రామ్ సోదరుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. తాజాగా చిత్ర యూనిట్ పలు టివి ఛానల్స్ కు టీవీ ఇంటర్వ్యూలు ఇస్తూ ప్రచారం మొదలు పెట్టారు. ఓ ఇంటర్వ్యూలో కళ్యాణ్ రామ్ కు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. 

మీరు, ఎన్టీఆర్ కలసి ఎప్పుడు నటించబోతున్నారు అని యాంకర్ ప్రశ్నించారు. మీరలా అడిగితే కథ కుదిరినప్పుడు అని రొటీన్ గా సమాధానం చెప్పాల్సి వస్తుంది. నాకు సొంతంగా ప్రొడక్షన్ ఉంది. నా ప్రొడక్షన్, తమ్ముడి ప్రొడక్షన్ వేరు కాదు. మా సొంత బ్యానర్ లో తమ్ముడు నటించాడు. నేను నిర్మాతగా వ్యవహరించా. భవిష్యత్తులో కూడా తమ్ముడితో సినిమా నిర్మిస్తా. 

బాలయ్యతో వర్కౌట్ కాలేదు.. కనీసం చిరంజీవితో అయినా..

కానీ కలసి నటించే విషయంలో మాత్రం ఏం జరుగుతుందో చెప్పలేం అని కళ్యాణ్ రామ్ తెలిపారు. 'మనం' చిత్రం తరహాలో నందమూరి ఫ్యామిలీ నుంచి ఒక మూవీ రావాలని అభిమానులు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. నందమూరి ఫ్యామిలీకి సెట్ అయ్యే కథ ఎప్పుడు రెడీ అవుతుందో వేచి చూడాలి.