మెగాస్టార్ చిరంజీవి చివరగా నటించిన చారిత్రాత్మక చిత్రం 'సైరా నరసింహారెడ్డి'. పాన్ ఇండియన్ ఫిలింగా తెరకెక్కిన సైరా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా విడుదలయింది. తెలుగు మినహా మిగిలిన అన్ని భాషల్లో సైరా నరసింహారెడ్డి చిత్రం నిరాశపరిచింది. 

తొలి తెలుగు స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రగా తెరకెక్కిన సైరా ఎందుకనో ఇతర భాషల ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. తెలుగులో మాత్రం మంచి కలెక్షన్లే వచ్చాయి. సైరా చిత్రానికి మరో ఊహించని షాక్ ఎదురైంది. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం కావడంతో సైరా చిత్రానికి బుల్లితెరపై కూడా అద్భుతమైన స్పందన వస్తుందని ఆశించారు. 

ఈ చిత్ర శాటిలైట్ హక్కులని ప్రముఖ ఛానల్ జెమిని సొంతం చేసుకుంది. సంక్రాంతి సందర్భంగా సైరా చిత్ర ప్రీమియర్ ని బుల్లితెరపై ప్రదర్శించారు. టీఆర్పీ రేటింగ్స్ మోతెక్కుతాయి అని అనుకుంటే సైరా చిత్రం ఉసూరుమనిపించింది. సైరా చిత్రానికి కేవలం 11.8 టీఆర్పీ రేటింగ్ నమోదైంది. జెమిని సంస్థ తెలుగు, తమిళం, మలయాళీ భాషలకి గాను సైరా శాటిలైట్ హక్కులని రూ25 కోట్ల భారీ మొత్తానికి దక్కించుకుంది. 

ప్రకాశ్ జవదేకర్ ను కలిశా, దాని కోసమే....: ఢిల్లీ పర్యటనపై కమెడియన్ అలీ

సైరా డిజిటల్ హక్కులు అన్ని భాషల్లో రూ 50 కోట్లకు అమెజాన్ ప్రైమ్ సంస్థ దక్కించుకుంది. బుల్లితెరపై సైరా చిత్రానికి ఆశించిన టిఆర్పి రేటింగ్ నమోదు కాకపోవడానికి కారణం అమెజాన్ ప్రైమ్ అని అంటున్నారు. బుల్లితెరపై కంటే ముందుగానే సైరా చిత్రం అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. అందువల్లే టిఆర్పి రేటింగ్ తగ్గగిందనే వాదన వినిపిస్తోంది. 

ప్రభాస్ తో సినిమా.. సంభ్రమాశ్చర్యంతో బాలయ్య హీరోయిన్ !

ఇక తమిళంలో మాత్రం సైరా చిత్రానికి మంచి టిఆర్పి రేటింగే నమోదైంది. తమిళంలో 15.8 రేటింగ్ నమోదు కావడం విశేషం. సురేందర్ రెడ్డి దర్శత్వంలో తెరకెక్కిన సైరా చిత్రంలో నయనతార హీరోయిన్ గా నటించగా.. తమన్నా కీలక పాత్ర పోషించింది. అమితాబ్, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్, జగపతి బాబు కూడా ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రల్లో నటించారు.