యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో చిత్రం అభిమానులని ఏమాత్రం మెప్పించలేకేపోయింది. దాదాపు 300 కోట్ల బడ్జెట్ లో తెరకెక్కిన ఈ చిత్రం గత ఏడాది విడుదలై నిరాశపరిచిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా తన తదుపరి చిత్రంతో అభిమానులని మెప్పించే ప్రయత్నాల్లో  ఉన్నాడు ప్రభాస్. రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ ప్రస్తుతం నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి జాన్ అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. 

ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. హైదరాబాద్ లో వేసిన భారీ సెట్స్ లో ఈ చిత్రాన్ని చిత్రీకరిస్తున్నారు. ఈ మూవీలో ప్రభాస్ కు తల్లిగా మైనే ప్యార్ కియా(ప్రేమ పావురాలు) ఫేమ్ భాగ్యశ్రీ నటిస్తోంది. ఈ వార్త సినీ అభిమానులందరినీ థ్రిల్ కి గురిచేసింది. 50 ఏళ్ల వయసొచ్చినా చెక్కు చెదరని అందంతో ఉన్న భాగ్య శ్రీ ప్రభాస్ కు తల్లిగా  నటిస్తుండడం ఆసక్తిని రేపుతోంది. 

ప్రభాస్ తో నటిస్తుండడంతో భాగ్యశ్రీ సంతోషానికి అవధులు లేవు. ఈ చిత్రంలో తన పాత్ర అద్భుతంగా ఉండబోతోందని తెలిపింది. ఈ చిత్రంలో  సులువు కాదు. ముఖ్యంగా నేను పోషించే పాత్రకు ఎంతో నైపుణ్యం కావాలి అని భాగ్యశ్రీ తెలిపింది. ఈ చిత్రం కోసం ఏర్పాటు చేసిన సెట్స్ తనని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తున్నాయని భాగ్యశ్రీ చెప్పుకొచ్చింది. 

మైనే ప్యార్ కియా లాంటి క్లాసిక్ చిత్రంలో నటించినప్పటికీ భాగ్యశ్రీ పరిమిత సంఖ్యలో మాత్రమే సినిమా చేసింది. తెలుగులో ఆమె బాలయ్య సరసన 1988లో రాణా అనే చిత్రంలో నటించింది. 

రాధాకృష్ణ దర్శత్వంలో తెరకెక్కుతున్న జాన్ చిత్రం 1960 కాలం నాటి పీరియాడిక్ ఫిలిం గా తెరకెక్కుతోంది. పూజా హెగ్డే హీరోయిన్.