పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కమెడియన్ అలీ ఎప్పుడు వెండితెరపై కనిపించినా  ఆ మ్యాజిక్ మరో లెవల్ లో ఉంటుంది. వీరిద్దరూ వెండితెరపై ఎంత సరదాగా ఉంటారో రియల్ లైఫ్ లో కూడా అంతే మంచి స్నేహితులు. అలీ తన బెస్ట్ ఫ్రెండ్ అని పవన్ కళ్యాణ్ స్వయంగా పలు వేదికలపై తెలిపారు. 

కానీ గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా వీరి మధ్యన మనస్పర్థలు ఏర్పడ్డాయి. చివరి నిమిషంలో అలీ వైఎస్ జగన్ కు మద్దతుగా వైసిపిలో చేరాడు. ఎన్నికల ప్రచారంలో పవన్ అలీని విమర్శించడం.. దానికి అలీ కౌంటర్ ఇవ్వడం కూడా చూశాం. 

తాజాగా మరో ఆసక్తికర రాజకీయ పరిణామం చోటు చేసుకునేలా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ ఇటీవల ఎక్కువగా ఢిల్లీలో బిజెపి పెద్దల చుట్టూ తిరుగుతున్నారు. బిజెపి జనసేన మధ్య పొత్తు కూడా కుదిరింది. ఇలాంటి తరుణంలో అలీ ఢిల్లీకి వెళ్లడం.. అక్కడ బిజెపి ఆఫీస్ లో ముఖ్య నేతలని కలుసుకోవడంతో కొత్త ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అలీ బిజెపికి దగ్గర కావడానికి పవన్ కళ్యాణ్ ప్రమేయం ఏమైనా ఉందా అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 

ఢిల్లీ బీజేపీ ఆఫీ‌స్‌లో సినీ నటుడు అలీ: జగన్‌కు షాకిస్తారా?

ఇదిలా ఉండగా తాను ఢిల్లీలో బిజెపి నేతలని కలవడానికి గల కారణాలని అలీ వివరించాడు. ఢిల్లీలో ప్రకాష్ జవదేకర్ గారిని కలిశా.. ఓ సినిమా షూటింగ్ అనుమతి కోసమే ఆయన్ని కలవడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించారు అని అలీ తెలిపాడు. 

జనసేన పొత్తు ఎఫెక్ట్, పవన్ కల్యాణ్ తో దోస్తీ: కమెడియన్ అలీ అందుకే...

గత సార్వత్రిక ఎన్నికల సమయంలో పవన్ కళ్యాణ్ టికెట్ విషయంలో అలికి హామీ ఇవ్వకపోవడం వల్లే అతడు వైసిపిలో చేరాడనే ఊహాగానాలు ఉన్నాయి. వైసిపిలో కూడా అలికి టికెట్ దక్కలేదు. ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా అలికి వైసిపిలో ఎలాంటి పదవులు, ప్రాధాన్యత దక్కలేదు. ఈ క్రమంలో అలీ బిజెపి నేతలని కలవడం కొత్త చర్చకు దారి తీస్తోంది. పైకి సినిమా పర్మిషన్ కోసమే అని చెబుతున్నప్పటికీ పవన్, అలీ కేంద్రంగా రాజకీయ ఊహాగానాలు మొదలయ్యాయి.