Asianet News TeluguAsianet News Telugu

సుప్రీంకోర్టులో రియా చక్రవర్తి పిటిషన్: సుశాంత్ తండ్రి కేవియట్ దాఖలు

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతిపై కేసు దర్యాప్తును పాట్నా నుంచి ముంబైకి బదిలీ చేయాలని ఆయన ప్రేయసి రియా చక్రవర్తి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ మీద కొత్త పరిణామం చోటు చేసుకుంది.

Sushant Singh Rajput dad moves Caveat After Rhea Chakraborthy moves Supreme Court
Author
New Delhi, First Published Jul 30, 2020, 3:37 PM IST

న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసును పాట్నా నుంచి ముంబైకి బదిలీ చేయాలని ఆయన ప్రేయసి రియా చక్రవర్తి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో మరో పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తండ్రి కేకే సింగ్ కేవియట్ దాఖలు చేశారు. 

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మృతి కేసు దర్యాప్తును బీహార్ నుంచి ముంబైకి బదిలీ చేయాలని కోరుతూ రియా చక్రవర్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయాన్ని ఆమె తరఫు న్యాయవాది సతీష్ మానేషిండే ధ్రువీకరించారు. 

సుశాంత్ సింగ్ మృతిపై ముంబై పోలీసులు ఇదివరకే దర్యాప్తు చేస్తున్నారని, ఆ కేసు వివరాలు అందరికీ అందుబాటులో ఉన్నాయని, ఈ స్థితిలో అదే కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అన్యాయమని ఆయన అన్నారు. 

Also Read: 'సుశాంత్ ది హత్య': సంచలన ఆధారాలు బయటపెట్టిన సుబ్రమణ్యస్వామి

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసు అనూహ్యమైన మలుపులు తిరుగుతోంది. సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిపై ఆయన తండ్రి కెకే సింగ్ బీహార్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తాను చేసిన ఫిర్యాదులో రియా చక్రవర్తి పేరును ప్రస్తావించారు. దాంతో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించడానికి సిద్ధమయ్యారు. 

ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు రియా చక్రవర్తి కోసం ముంబైలోని ఆమె ఇంటికి వెళ్లారు. అయితే ఆమె అప్పటికే అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. దాంతో బీహార్ పోలీలులు ఆమె కోసం లుకవుట్ నోటీసులు జారీ చేశారు.

Also Read: నిజం కోసం కలిసికట్టుగా పోరాడాలి.. సుశాంత్ సోదరి భావోద్వేగం

నలుగురితో కూడిన పోలీసు బృందం పాట్నా నుంచి ముంబైకి చేరుకుంది. సుశాంత్ తండ్రి కృష్ణకుమార్ సింగ్ చేసిన ఫిర్యాదులోని వాస్తవాలను తెలుసుకోవడానికి వారు రియాను ప్రశ్నించాలని అనుకున్నారు. అయితే, ఆమె తన ఇంట్లో కనిపించలేదని జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. తన మరణించే వారకు సుశాంత్ రియాతో డేటింగ్ చేస్తున్నాడు. వారిద్దరు పెళ్లు చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. సుశాంత్ జూన్ 14వ తేదీన మరణించాడు. 

ఇదిలావుంటే, కేసును బీహార్ నుంచి ముంబైకి బదిలీ చేయాలని రియా చక్రవర్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ విషయాన్ని ఆమె తరఫు న్యాయవాది సతీష్ మనీషిండే చెప్పారు.  

Follow Us:
Download App:
  • android
  • ios