సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం బాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే. సుశాంత్ ఆత్మహత్యకు బాలీవుడ్ లోని ప్రముఖులు కారణం అని కొందరు అంటుంటే..... అతడిది ఆత్మహత్య కాదు, హత్య అని ఇంకొందరు అంటున్నారు. 

తాజాగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ది ఆత్మహత్య కాదు హత్య అంటూ బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి సంచలన ట్వీట్ చేసారు. అందుకు సంబంధించి ఆయన 'ప్రూఫ్స్' ని కూడా ట్విట్టర్ లో షేర్ చేసారు. మహారాష్ట్ర హోమ్ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ ఈ కేసులో సిబిఐ విచారణ ఉండబోదు అని చెప్పిన గంటల వ్యవధిలోనే సాక్ష్యాధారాలు అంటూ సుబ్రమణ్యస్వామి ట్వీట్ చేయడం ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తుంది. 

గొంతు మీద ఉరి వేసుకోవడం వల్ల కలిగిన గాయం, ఆ వస్త్రం వల్ల కలిగిన గాయంతో మ్యాచ్ అవకపోవడం, రూమ్ డూప్లికేట్ కీ మిస్ అవడం, పని వాళ్ళు చెబుతున్న  ఒకదానితో మరోదానికి పొంతన లేకపోవడం,  సిం కార్డులను మార్చడం, ఆర్థికంగా ఇబ్బందులు లేకపోవడం ఇవన్నీ వెరసి సుశాంత్ ది ఆత్మహత్య కాదు హత్య అని సుబ్రమణ్య స్వామి అంటున్నారు. 

బీహార్ పోలీసులు గనుక ఈ కేసులో నిజనిర్ధారణ గురించి నిజంగా ఇంట్రెస్టేడ్ గా ఉంటె సిబిఐ విచారణ తప్ప ఇంకో మార్గం లేదని, మరో ట్వీట్ లో అన్నాడు. ఇరు రాష్ట్రాల పోలీసులు ఒకే కేసును విచారించలేరు కాబట్టి సిబిఐ విచారనొక్కటే మార్గం అని అన్నాడు. 

గతంలో ప్రధానికి రాసిన లేఖలో ఈ కేసులో సిబిఐ విచారణను జరిపించమని సుబ్రమణ్య స్వామి కోరారు. దుబాయ్ లో ఉండే డాన్స్ ద్వారా బాలీవుడ్ లోని ప్రముఖులు ఈ కేసును మూసివేయాలని ముంబై పోలీసులపై, మహారాష్ట్ర ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకువస్తున్నారని ఆయన ఆరోపించారు.