సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్ ఆత్మహత్య వార్త విన్న దగ్గర నుంచి ఆయన కుటుంబం షాక్‌లోనే ఉంది. ఎంతో భవిష్యత్తు ఉన్న సుశాంత్ అర్థాంతరంగా తనువు చాలించటంతో ఆయన కుటుంబం తీవ్ర మనో వేదనకు గురైంది. ఇప్పుడిప్పుడే ఆ షాక్‌ నుంచి కోలుకుంటున్న ఫ్యామిలీ, ఆత్మహత్యకు కారణాలపై కీలక వ్యాఖ్యలు చేసింది. ముఖ్యంగా సుశాంత్ గర్ల్‌ ఫ్రెండ్ రియా కారణంగానే సుశాంత ఆత్మహత్య చేసుకొని ఉండాడన్న అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. ఈ నేపథ్యంలో సుశాంత్ సోదరి తన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో భావోద్వేగంగా స్పందించారు.

సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ క్రితి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. సుశాంత్‌ మరణం తరువాత సోదరుడితో తన అనుబంధం గురించి అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. `మనం అందరం కలిసి కట్టుగా నిలబడాలి, నిజం కోసం అందరం కలిసి కట్టుగా పోరాడాలి` అంటూ కామెంట్ చేసింది. సుశాంత్ అభిమానులు శ్వేతకు మద్దతుగా కామెంట్లు చేస్తున్నారు.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ గత నెల 14న ముంబైలోని తన నివాసంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో అవకాశాల చేజారటంతోనే సుశాంత్‌ ఆత్మహత్య చేసుకున్నాడన్న ప్రచారం జరిగింది. అంతేకాదు. బాలీవుడ్ ఇండస్ట్రీలోని మాఫియానే సుశాంత్ మృతికి కారణంగా అంటూ ఇండస్డ్రీ ప్రముఖులు కూడా విమర్శలు గుప్పించారు.