Asianet News TeluguAsianet News Telugu

ఆ హీరోయిన్ పై రూ.1500 కోట్లు.. షాకింగ్ డీటైల్స్!

సినిమా రికార్డులంటే ముందుగా హీరోల పేర్లు మాత్రమే గుర్తకు వస్తాయి. కానీ అందులో హీరోయిన్ల పాత్ర కూడా ఎంతైనా ఉంటుంది. గ్లామర్ పరంగా కానీ, నటన పరంగా కానీ హీరోయిన్లు సినిమా బిజినెస్ కు తమ వంతు తోడ్పడుతారు. ముఖ్యంగా బాలీవుడ్ లో నటీమణులకు పారితోషికం అత్యధికంగా ఉంటుంది. 

sonakshi sinha creates unique record as an actress
Author
Hyderabad, First Published Feb 6, 2020, 8:38 PM IST

సినిమా రికార్డులంటే ముందుగా హీరోల పేర్లు మాత్రమే గుర్తకు వస్తాయి. కానీ అందులో హీరోయిన్ల పాత్ర కూడా ఎంతైనా ఉంటుంది. గ్లామర్ పరంగా కానీ, నటన పరంగా కానీ హీరోయిన్లు సినిమా బిజినెస్ కు తమ వంతు తోడ్పడుతారు. ముఖ్యంగా బాలీవుడ్ లో నటీమణులకు పారితోషికం అత్యధికంగా ఉంటుంది. 

అందాల తార సోనాక్షి సిన్హా 2010లో దబంగ్ చిత్రంతో సల్మాన్ ఖాన్ సరసన హీరోయిన్ గా పరిచయమైంది. తొలి చిత్రంతోనే బాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ దక్కించుకున్న సోనాక్షి సిన్హా ఆ తర్వాత రోజు రోజుకూ నటిగా పరిణితి కనబరిచింది. కేవలం కమర్షియల్ చిత్రాల్లో మాత్రమే కాక.. ప్రయోగాత్మక చిత్రాలతో కూడా సోనాక్షి సిన్హా సత్తా చాటింది. 

సోనాక్షి సిన్హా గడచిన గత దశాబ్దంలో అరుదైన రికార్డ్ ని సొంతం చేసుకుంది. 2010 తర్వాత ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్లలో సోనాక్షి అగ్ర స్థానంలో నిలిచింది. ఇందుకు నిదర్శనం ఆమె నటించిన చిత్రాల సక్సెస్ రేట్, సాధించిన వసూళ్లు. 

కోడి రామకృష్ణ కుమార్తె వివాహ వేడుకలో చిరంజీవి, బాలయ్య.. సెలెబ్రిటీల సందడి

సోనాక్షి సిన్హా నటించిన తొలి ఐదు చిత్రాల్లో నాలుగు చిత్రాలు 100 కోట్ల వసూళ్లు సాధించాయి. టోటల్ గా సోనాక్షి సిన్హా కెరీర్ లో 100 కోట్ల కలెక్షన్స్ సాధించిన చిత్రాలు 7 ఉన్నాయి. దబంగ్, రౌడీ రాథోడ్, దబంగ్ 2, సన్నాఫ్ సర్దార్, హాలిడే, మిషన్ మంగళ్, దబంగ్ 3 చిత్రాలు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టాయి. ఇందులో 4 చిత్రాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. 

మెగాస్టార్ దగ్గర 3 మంకీస్ అతి విధేయత.. వీడియో చూశారా!

ఓవరాల్ గా చూసుకుంటే సోనాక్షి సిన్హా గత దశాబ్దంలో 1500 కోట్ల బిజినెస్ కు కారణమైన హీరోయిన్ గా రికార్డ్ సృష్టించింది. ప్రతి చిత్రంలో నటనలో పరిణితి కనబరుస్తూ సోనాక్షి విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంటోంది. సోనాక్షి సిన్హా సాధిస్తున్న ఈ విజయాలు చూసి బాలీవుడ్ ప్రముఖులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. ఆమెని లక్కీ హీరోయిన్ అంటూ ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. 

బాబీతో ఓకె.. మరి ఆ డైరెక్టర్ తో.. ఇచ్చిన మాట కోసం పవన్ షాకింగ్ డెసిషన్!

1500 కోట్ల బిజినెస్ పై సోనాక్షి సిన్హా సోషల్ మీడియాలో స్పందించింది. ప్రేక్షకులు తనపై చూపిస్తున్న ప్రేమాభిమానాలే తన విజయాలకు కారణం అని తెలిపింది. నాలోని నైపుణ్యం ఈ ప్రకృతి ఇచ్చిన వరం. గడచిన ఇన్నేళ్ళలో అవకాశాల కోసం లాబీయింగ్ చేయాల్సిన అవసరం లేదని, అవార్డులు పెద్ద విషయం కాదని తెలుసుకున్నాను. నా పని మాత్రమే అందరికి కనిపించాలని అనుకుంటున్నాను అని సోనాక్షి తెలిపింది. 

Follow Us:
Download App:
  • android
  • ios