పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మునుపెన్నడూ లేని విధంగా వరుస పెట్టి సినిమాలు అంగీకరిస్తున్నాడు. అందులో రెండు చిత్రాలు ప్రారంభం అయ్యాయి. మరో చిత్రానికి అధికారిక ప్రకటన వచ్చింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో ఏకంగా ఐదు చిత్రాలు ఉన్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి. 

మిగిలిన ఆ రెండు చిత్రాల విషయంలో పవన్ ఒక రకంగా సాహసోపేతమైన నిర్ణయమే తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రాలేదు కానీ.. ఇండస్ట్రీలో జరుగుతున్న చర్చ ప్రకారం పవన్ కళ్యాణ్ దర్శకుడు బాబీ(కేఎస్ రవీంద్ర), డాలీ(కిషోర్ పార్థసాని) లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 

ఈ రెండు ప్రాజెక్ట్స్ పై పవన్ ఫ్యాన్స్ కాస్త కలవరంతో ఉన్నారు. ఎందుకంటే వీరిద్దరూ స్టార్ డైరెక్టర్స్ కాదు.. వీరికి భారీ విజయాలేవీ లేవు. ఈ దర్శకులు తెరక్కించిన చిత్రాలు యావరేజ్ నుంచి హిట్ అనిపించేకునే స్థాయి వరకు ఆడాయి. 

'రంగస్థలం' నాకొక అదృష్టం, కథ కూడా వినలేదు.. సమంత కామెంట్స్!

దర్శకుడు బాబీకి కమర్షియల్ చిత్రాలు ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసు. కాబట్టి బాబీకి విషయంలో అంతగా వర్రీ కావాల్సిన అవసరం లేదు. ఇక డాలీకి ఇటీవల సరైన సక్సెస్ లేదు. డాలీ దర్శత్వంలో పవన్ కళ్యాణ్ నటించిన గోపాల గోపాల చిత్రం పర్వాలేదనిపించగా, కాటమరాయుడు నిరాశపరిచింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వీరికి ఎందుకు అవకాశం ఇచ్చారనే చర్చ జరుగుతోంది. 

అర్థ నగ్నంగా డెడ్లీ విలన్ భార్య.. 'బట్టలు సరిగా వేసుకో' అంటూ ట్రోల్స్

ఇచ్చిన మాట కోసమే పవన్ కళ్యాణ్ ఈ దర్శకులిద్దరితో సినిమాలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రం తర్వాత మరో సినిమా చేస్తానని బాబీకి.. కాటమరాయుడు తర్వాత డాలీకి పవన్ మాట ఇచ్చారట. దీనితో చాలా రోజులుగా డాలీ పవన్ కోసం ఓ కథ రాసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేస్తున్న మూడు ప్రాజెక్ట్స్ ఓ కొలిక్కి వచ్చాక ఈ రెండు చిత్రాలపై క్లారిటీ వస్తుంది.