ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ కు పెద్ద దిక్కుగా మారారు. సుడిగాలి సుధీర్ లాంటి జబర్దస్త్ కమెడియన్ల నుంచి సూపర్ స్టార్ మహేష్ లాంటి బడా స్టార్స్ వరకు చిరంజీవి ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తున్నారు. దాదాపుగా అందరు హీరోలు, నటులు, నటీమణులు, దర్శకులు, నిర్మాతలు తమ చిత్రాలు విడుదలవుతున్న సమయంలో చిరంజీవి బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు. 

జబర్దస్త్ తో పాపులర్ అయిన నటులు సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ లు మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. బుల్లితెరపై సత్తా చాటిన ఈ ముగ్గురు నటులు  తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ ముగ్గురూ కలసి నటించిన 3 మంకీస్ అనే చిత్రం శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు రానుంది. 

బాబీతో ఓకె.. మరి ఆ డైరెక్టర్ తో.. ఇచ్చిన మాట కోసం పవన్ షాకింగ్ డెసిషన్!

ఈ నేపథ్యంలో సుధీర్, శ్రీను, రాంప్రసాద్ చిరంజీవిని కలసి తమ చిత్ర థ్రిల్లర్ చూపించారు. ట్రైలర్ బావుందని చిరంజీవి ఈ ముగ్గురిని అభినందించారు. చిరంజీవి ట్రైలర్ చూస్తున్న సమయంలో సుధీర్, ఆటో రాంప్రసాద్ చేతులు కట్టుకుని విధేయతతో చిరంజీవి వెనుకాల నిలబడి ఉన్నారు. ఈ దృశ్యాలు నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి. 

అర్థ నగ్నంగా డెడ్లీ విలన్ భార్య.. 'బట్టలు సరిగా వేసుకో' అంటూ ట్రోల్స్

అనిల్ కుమార్ దర్శత్వంలో 3 మంకీస్ చిత్రం తెరకెక్కింది. బుల్లితెరపై కామెడీ పంచ్ లతో వినోదాన్ని పంచిన ఈ ముగ్గరు నటిస్తున్న చిత్రం కావడంతో ఆసక్తి నెలకొని ఉంది.