సింగర్ చిన్మయి తరచుగా సినీ ప్రముఖులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇండియాలో మీటూ ఉద్యమం మొదలయ్యాక చిన్మయి తమిళ చిత్ర పరిశ్రమలో తనకు ఎదురైన లైంగిక వేధింపులపై సంచలన వ్యాఖ్యలు చేసింది. తమిళ రచయిత వైరముత్తు తనని లైంగికంగా వేధించినట్లు చిన్మయి చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. అప్పటి నుంచి తనపై ఎన్ని విమర్శలు ఎదురైనా చిన్మయి చిత్ర పరిశ్రమలో మహిళలకు జరుగుతున్న వేధింపులకు వ్యతిరేకంగా పోరాడుతోంది. 

తాజాగా చిన్మయి సోషల్ మీడియా వేదికగా చిత్ర పరిశ్రమలో హీరోయిన్లకు ఉన్న మైండ్ సెట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తమిళ నటి రేఖ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఓ చిత్ర షూటింగ్ లో కమల్ హాసన్ తనని బలవంతంగా ముద్దు పెట్టుకున్నట్లు తెలిపింది. ఈ విషయాన్ని రేఖ నవ్వుతూ చాలా క్యాజువల్ గా తెలిపారు. 

దీనిపై చిన్మయి స్పందించింది. రేఖ గారి ఇంటర్వ్యూ చూశాను. ఆమె తనని కమల్ హాసన్ బలవంతంగా ముద్దు పెట్టుకున్నారని నవ్వుతూ చెప్పారు. దీనిని సీరియస్ చేస్తే మళ్ళీ తనని ఎవరైనా వేలెత్తి చూపుతారేమో అని ఆమె భయం. సెట్ లో ఏం జరిగినా,మగాళ్లు ఏం చేసినా ఇదంతా చాలా కామన్ అనే మైండ్ సెట్ ని ఆడవాళ్ళలో క్రియేట్ చేశారు. 

పూరి దర్శకత్వంలో పవర్ స్టార్.. 400 కోట్ల టార్గెట్ ?

బలవంతంగా ముద్దు పెట్టుకున్నప్పటికీ అది సీన్ లో భాగమే అని చాలా సాధారణంగా చెప్పేస్తుంటారు. అలాగే కొందరు దర్శకులు హీరోయిన్లని కొట్టడాన్ని కూడా గర్వంగా చెప్పుకుంటారు. హీరోయిన్ల నుంచి మంచి నటన రాబట్టుకోవడం కోసం వారి బుగ్గలు వాచిపోయేలా కొట్టినా.. దానిని గొప్పగా చెప్పుకునే దర్శకులు ఉన్నారని చిన్మయి ఆగ్రహం వ్యక్తం చేసింది. 

ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారుతున్న సమీరారెడ్డి కుమార్తె.. క్యూట్ ఫొటోస్ వైరల్!