జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా మారారు. పవన్ కళ్యాణ్ నుంచి త్వరలో పింక్ రీమేక్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని మేలో రిలీజ్ చేసే సన్నాహకాలు చేస్తున్నారు. మరోవైపు క్రిష్ దర్శత్వంలో చిత్రాన్ని కూడా పవన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. 

పీరియాడిక్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ తర్వాత పవన్  తనకు గబ్బర్ సింగ్ లాంటి బంపర్ హిట్ ఇచ్చిన హరీష్ శంకర్ తో ఓ చిత్రం చేయబోతున్నాడు. ఇక పవన్ ఈ ఏడాది మరో సినిమా ప్రారంభించే అవకాశం లేదు. ఇదిలా ఉండగా వచ్చే ఏడాది కూడా కొందరు దర్శకులతో వర్క్ చేసేందుకు పవన్ చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. 

హరీష్ శంకర్ చిత్రం తర్వాత పవన్ కళ్యాణ్ పూరి జగన్నాధ్ కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొన్ని రోజుల క్రితమే ఈ కాంబినేషన్ పై వార్తలు వచ్చాయి. పూరి జగన్నాధ్ పవన్ ని కలసి దేశభక్తి నేపథ్యంలో ఓ చిత్రం చేయాలనుకుంటున్నట్లు తెలిపారట. దీనికి పవన్ కళ్యాణ్ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

పవన్ కళ్యాణ్ ఓ చిత్రానికి దాదాపు రూ50 కోట్ల పారితోషికం అందుకుంటున్నారు. ఈ నాలుగేళ్లలో దాదాపు 400 కోట్లకు సినిమాల ద్వారా ఆదాయం పొందాలని పవన్ కళ్యాణ్ టార్గెట్ గా పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనితో వేగంగా సినిమాలు పూర్తి చేయాలనే ఆలోచనలో పవన్ ఉన్నట్లు తెలుస్తోంది. 

ఇంటర్నెట్ సెన్సేషన్ గా మారుతున్న సమీరారెడ్డి కుమార్తె.. క్యూట్ ఫొటోస్ వైరల్!

పూరి, పవన్ కాంబోలో సినిమా సెట్ అయితే అభిమానులకు అంతకు మించిన సంతోషం ఉండదు. పవన్ కళ్యాణ్ బద్రి చిత్రంతో పూరి జగన్నాధ్ దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత వారిద్దరి కాంబోలో కెమెరామెన్ గంగతో రాంబాబు చిత్రం వచ్చింది. ప్రస్తుతం పూరి విజయ్ దేవరకొండతో ఓ చిత్రం తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ తర్వాత పూరి పవన్ చిత్రానికి సంబంధించిన వర్క్ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి.