దాదాపు 18 ఏళ్లుగా శ్రీయ హీరోయిన్ గా రాణిస్తోంది. 2001లో ఇష్టం చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన శ్రీయ తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. అగ్రహీరోల సరసన అనేక సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ఇటీవల శ్రీయ ప్రభావం తగ్గినప్పటికీ హీరోయిన్ గా అవకాశాలు అందుకుంటూనే ఉంది. 

గత ఏడాది శ్రీయ రష్యాకు చెందిన ఆండ్రీ కోసీవ్ ని వివాహం చేసుకుంది. అతడితో ప్రేమలో పడ్డ శ్రీయ గత ఏడాది మార్చి లో రాజస్థాన్ లో వివాహం చేసుకుంది. వీరిద్దరి పెళ్లి వేడుక కేవలం కుటుంబ సభ్యుల మధ్య మాత్రమే రహస్యంగా జరిగింది. సీక్రెట్ గా పెళ్లి చేసుకోవడంపై శ్రీయ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందించింది. 

'ఇందులో సీక్రెట్ ఏమీ లేదు.. నా వ్యక్తిగత విషయాలు బయటకు చెప్పుకొను. గోప్యంగా ఉంచేందుకే ఇష్టపడతా. నా జీవితం గురించి అందరికి తెలియాలని అనుకోను. అందుకే సింపుల్ గా ఉంటా. మా వివాహం జరిగి దాదాపు రెండేళ్లు అవుతోందంటే నమ్మలేకపోతున్నా' అని శ్రీయ తెలిపింది.  

2019లో అత్యధిక టీఆర్పీ రేటింగ్స్ సాధించిన చిత్రాలు.. 'సైరా' కళ్ళు చెదిరే రికార్డ్

వివాహం తర్వాత కూడా సినిమాలు చేస్తుండడాన్ని కారణం తన భర్తే అని శ్రీయ తెలిపింది.  నా భర్తకు నేను నా వృత్తిలో బిజీగా ఉండడం అంటేనే ఇష్టం. ఇక సినిమా నుంచి వచ్చే ఆదాయంతోనే మా ఫ్యామిలీ భోజనం చేస్తోంది. అందుకే నటనని ఇప్పటికి కొనసాగిస్తున్నట్లు శ్రీయ తెలిపింది. 

మహేష్, అల్లు అర్జున్ మధ్య నలిగిపోతున్న దిల్ రాజు.. లిస్ట్ కూడా రెడీ!

శ్రీయ భర్త ఆండ్రీ కోసీవ్ రష్యాలో టెన్నిస్ క్రీడాకారుడిగా, వ్యాపార వేత్తగా గుర్తింపు పొందాడు. శ్రీయ తన కెరీర్ లో చిరంజీవి, రజనీకాంత్, పవన్ కళ్యాణ్, మహేష్, నాగార్జున, వెంకటేష్ లాంటి స్టార్ హీరోల సరసన నటించింది.