సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బాక్సాఫీస్ వద్ద తలపడనుండడంతో సంక్రాంతి సమరం రంజుగా మారింది. సినీ అభిమానులకు సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో చిత్రాల మధ్య పోటీ ఆసక్తిగానే ఉంటుంది. కానీ ఇరు చిత్రాల నిర్మాతలకు, ఆయా హీరోల ఫ్యాన్స్ కు టెన్షన్ తప్పడం లేదు. 

ఈ రెండు చిత్రాలు వరుసగా జనవరి 11, 12 తేదీల్లో విడుదల కానుండడంతో వసూళ్లపై ఎలాంటి ప్రభావం ఉంటుందనే టెన్షన్ నెలకొంది. ముందుగా ఈ రెండుచిత్రాలు జనవరి 11నే రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాయి. ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ అల వైకుంఠపురములో చిత్రాన్ని ఒక రోజు ముందుకు జరిపి జనవరి 12న రిలీజ్ ఫిక్స్ చేసుకున్నారు. 

ఇదిలా ఉండగా దిల్ రాజు సరిలేరు చిత్ర నిర్మాతల్లో ఒకరు. అందరికంటే ఎక్కువగా దిల్ రాజుకే సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో చిత్రాల టెన్షన్ పట్టుకుంది. సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో రెండు చిత్రాలని దిల్ రాజే నైజాం ఏరియాలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. దీనితో ఏ చిత్రానికి ఎన్ని థియేటర్స్ కేటాయించాలనే ఒత్తిడిలో దిల్ రాజు ఉన్నారు. 

సమంతతో మొదలైన సునామి.. ఈ దశాబ్దంలో టాలీవుడ్ కి దొరికిన బెస్ట్ హీరోయిన్స్!

ఇప్పటికే సరిలేరు.. చిత్ర యూనిట్ కొన్ని ప్రధానమైన థియేటర్స్ లిస్ట్ రెడీ చేసి దిల్ రాజుకు అందించారట. ఈ థియేటర్స్ లో తప్పకుండా సరిలేరు మూవీ ఉండాలని కోరినట్లు తెలుస్తోంది. అదేవిధంగా అలా వైకుంఠపురములో చిత్ర యూనిట్ కూడా కొన్ని థియేటర్స్ లిస్ట్ రెడీ చేసి పంపిందట. దీనితో దిల్ రాజు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారు. 

బన్నీ-సుకుమార్ సినిమా.. ఆ సీన్ హైలైట్!

సరిలేరు నీకెవ్వరు చిత్రానికి అనిల్ రావిపూడి దర్శకుడు. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ దర్శత్వంలో అల వైకుంఠపురములో చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో బన్నీకి జోడిగా పూజా హెగ్డే నటిస్తోంది.