Asianet News TeluguAsianet News Telugu

దుమ్ములేపుతున్న డాన్స్ వీడియో.. బికినీలో ప్రభాస్ హీరోయిన్ అందాలు

క్రేజీ హీరో టైగర్ ష్రాఫ్ నుంచి రాబోతున్న మరో మాస్ మసాలా ఎంటర్టైనర్ భాగీ 3. భాగీ సిరీస్ లో భాగంగా టైగర్ ష్రాఫ్, శ్రద్దా కపూర్ మరోసారి జంటగా నటించారు. భాగీ 3 చిత్రం అహ్మద్ ఖాన్ దర్శత్వంలో తెరకెక్కుతోంది. షాజిద్ నడియావాలా ఈ చిత్రానికి నిర్మాత.

Shraddha kapoor bikini video goes viral
Author
Hyderabad, First Published Feb 12, 2020, 6:32 PM IST

క్రేజీ హీరో టైగర్ ష్రాఫ్ నుంచి రాబోతున్న మరో మాస్ మసాలా ఎంటర్టైనర్ భాగీ 3. భాగీ సిరీస్ లో భాగంగా టైగర్ ష్రాఫ్, శ్రద్దా కపూర్ మరోసారి జంటగా నటించారు. భాగీ 3 చిత్రం అహ్మద్ ఖాన్ దర్శత్వంలో తెరకెక్కుతోంది. షాజిద్ నడియావాలా ఈ చిత్రానికి నిర్మాత. గత ఏడాది ప్రభాస్, శ్రద్దా కపూర్ నటించిన సాహో చిత్రం విడుదలయింది. ఈ చిత్రం విజయం సాధించినప్పటికీ సౌత్ లో శ్రద్దా కపూర్ ఇమేజ్ పెరిగేలాచేసింది. 

భాగీ 3 చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా మార్చ్ 6న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు. దీనితో ప్రచార కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. కళ్ళు చెదిరే యాక్షన్ సన్నివేశాలు, శ్రద్దా కపూర్ గ్లామర్ మాస్ ప్రేక్షకులని ఈ చిత్రం వైపు ఆకర్షించేలా చేస్తున్నాయి. 

అయ్యో.. వరుణ్ రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ వదిలేసుకున్నాడా!

ఈ చిత్రంలో 'దస్ బహానా కర్కే' అనే సూపర్ హిట్ సాంగ్ ని రీమిక్స్ చేస్తున్నారు. తాజాగా ఆ వీడియో సాంగ్ ని కొంత భాగం యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. టైగర్ ష్రాఫ్ తన డాన్స్ మూమెంట్స్ తో అదరగొడుతుంటే.. శ్రద్దా కపూర్ బికినీ అందాలతో మతి పొగుడుతోంది. కొద్దిసేపటి క్రితం విడుదల చేసిన ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అప్పుడే ఈ పాటకు 5 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కాయి. 

అలా ఇంటికి వెళితే చైతు నన్ను చంపేస్తాడు: సమంత

ఈ సాంగ్ లో టైగర్ ష్రాఫ్, శ్రద్దా కపూర్ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరినట్లు ఉంది. టైగర్ ష్రాఫ్ సిక్స్ ప్యాక్ లుక్, డాన్స్, శ్రద్దా అందాలు అభిమానులకు కనువిందు చేస్తున్నాయి. వీడియో సాంగ్ పై మీరు కూడా ఓ లుక్కేయండి. 

Follow Us:
Download App:
  • android
  • ios