హ్యాపీ డేస్ చిత్రంతో వరుణ్ సందేశ్ కు యువతలో మంచి గుర్తింపు దక్కింది. ఆ చిత్రంలో వరుణ్ ఇంజనీరింగ్ స్టూడెంట్ గా బాగా ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత కొత్త బంగారు లోకం చిత్రం కూడా సూపర్ హిట్ గా నిలిచింది. దీనితో వరుణ్ కెరీర్ లో దూసుకుపోతున్నట్లే కనిపించాడు. 

కానీ ఆ తర్వాత వరుణ్ కెరీర్ డౌన్ ఫాల్ మొదలైంది. కథల ఎంపికలో లోపమో, వచ్చిన ఆఫర్స్ ని వదులుకోవడం వల్లనో వరుణ్ విజయాలకు దూరమయ్యాడు. వరుణ్ సందేశ్, వితిక దంపతులు గత ఏడాది ముగిసిన బిగ్ బాస్ సీజన్ 3 లో పాల్గొన్న సంగతి తెలిసిందే. బిగ్ బాస్ ద్వారా మరోసారి వితిక, వరుణ్ అభిమానులకు చేరువయ్యారు. 

రీసెంట్ గా వీరిద్దరూ అలీ హోస్ట్ గా నిర్వహిస్తున్న ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో వరుణ్ తన కెరీర్ గురించి అనేక విషయాలు పెంచుకున్నాడు. హ్యాపీడేస్ చిత్రం చేసే సమయంలో నా వయసు 18 ఏళ్ళు. కథల విషయంలో అప్పుడు నాకు జడ్జిమెంట్ తెలియదు. అందుకే కథలని నాన్నగారు విని ఓకే చేసేవారు. ఆయనకు కూడా కథల ఎంపికలో అనుభవం లేదు. 

మంచు లక్ష్మి గ్లామర్ రచ్చ (హాట్ ఫొటోస్)

దానివల్ల కొన్ని చిత్రాలు తప్ప మిగిలినవి ఫెయిల్ అయ్యాయి. భీమిలి కబడ్డీ జట్టు చిత్రంలో నటించే ఆఫర్ మొదట మీకు వచ్చిందట అని అలీ వరుణ్ ని ప్రశ్నించగా.. అలా ఎన్ని చిత్రాలు వదులుకున్నానో గుర్తులేదు. ఆ చిత్రం ఒక్కటే కాదు.. 100%లవ్, గుండెజారి గల్లంతయ్యిందే లాంటి సూపర్ హిట్ చిత్రాలు ఎన్నో వదులుకున్నాను.. నాకు రాసిపెట్టి లేదు అంతే అని వరుణ్ తెలిపాడు. తాను చేసిన కొన్ని చిత్రాలు బావున్నప్పటికీ ప్రేక్షకులకు చేరువ కాలేదని వరుణ్ తెలిపాడు.