అక్కినేని వారసుడు నాగచైతన్య, క్రేజీ హీరోయిన్ సమంత 2017లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. వీరిద్దరిది ప్రేమ వివాహం. సమంత, నాగ చైతన్య తొలిసారి ఏ మాయ చేశావే చిత్రంలో జంటగా నటించారు. ఆ తర్వాత ఆటోనగర్ సూర్య, మనం, మజిలీ లాంటి చిత్రాల్లో చైతు సమంత జంటగా నటించారు. 

చాలా కాలంగా ప్రేమలో ఉన్న వీరిద్దరూ 2017లో కుటుంబసభ్యుల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ జంట అన్యోన్యంగా జీవిస్తున్న సంగతి తెలిసిందే. సమంత తాజాగా నటించిన చిత్రం జాను. తమిళంలో విజయం సాధించిన 96 చిత్రానికి రీమేక్ గా తెరకెక్కింది. జాను చిత్రానికి టాక్ బాగానే ఉన్నప్పటికీ వసూళ్లు అంతంత మాత్రంగానే ఉన్నాయి. 

ప్రస్తుతం సమంత ప్రచార కార్యక్రమాలతో బిజీగా గడుపుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాను ఫ్యామిలీని, సినిమాని బ్యాలెన్స్ చేస్తున్న విధానం గురించి చెప్పుకొచ్చింది. సాయంత్రం 6 గంటలకు షూటింగ్ ముగించుకునేందుకు ప్రయత్నిస్తా. ఆ తర్వాత టైం మొత్తం నాగ చైతన్య కోసమే కేటాయిస్తా. 

నేను సినిమా గురించి, నా పాత్ర గురించి ఆలోచించేది మా ఇంటి గేటులోకి ఎంటర్ అయ్యేంతవరకే. ఆ తర్వాత సినిమా గురించి పట్టించుకోను. ఒక వేళ నేను ఇంట్లో కూడా నా రోల్ గురించే ఆలోచిస్తే నాగ చైతన్య చంపేస్తాడు అంటూ సమంత సరదాగా చెప్పుకొచ్చింది. 

బోల్డ్ సీన్స్ ఎఫెక్ట్.. స్టార్ హీరో కుమార్తెకు షాక్!

ప్రేమ్ కుమార్ దర్శత్వంలో తెరకెక్కిన జాను చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. శర్వానంద్ హీరోగా నటించాడు. సమంత ఇటీవల రంగస్థలం, ఓ బేబీ, మహానటి, మజిలీ లాంటి నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలని ఎంచుకుంటోంది. 

మత మార్పిడులే కారణమా.. విజయ్ ఐటీ రైడ్స్ పై విజయ్ సేతుపతి స్ట్రాంగ్ రిప్లై