బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ అంటే పిచ్చెక్కిపోయే అభిమానులు నార్త్ లో ఉన్నారు. దశాబ్దాలుగా షారుఖ్ బాలీవుడ్ లో స్టైల్ ఐకాన్ గా ఉన్నాడు. తన నటనతో షారుఖ్ ఇన్నేళ్ళుగా అభిమానులని అలరిస్తూ వస్తున్నాడు. ఇటీవల షారుఖ్ ఖాన్ కు సరైన సక్సెస్ లేదు. 2018లో షారుఖ్ ఖాన్ నటించిన జీరో చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. 

జీరో మూవీ తర్వాత షారుఖ్ తన తదుపరి చిత్రాన్ని ఇంకా ప్రకటించలేదు. షారుఖ్ కొత్త సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఓ అభిమాని అయితే షారుఖ్ కొత్తసినిమా ప్రకటించకుంటే ఆత్మహత్య చేసుకుంటా అని బెదిరింపులకు దిగుతున్నాడు.  షారుఖ్ ఖాన్ ఫ్యాన్ అనే పేరుతో ఉన్న ఓ ట్విట్టర్ అకౌంట్ నుంచి వెలువడినట్వీట్ వైరల్ గా మారింది. 

కనీసం బూతు లేదు.. మెగా హీరో సినిమాపై అల్లు అరవింద్ డౌట్లు!

జనవరి 1న షారుఖ్ ఖాన్ కొత్త సినిమా అనౌన్స్ మెంట్ చేయకుంటే సూసైడ్ చేసుకుంటా అని ట్వీట్ చేశాడు. జీరో చిత్రం తీవ్రంగా నిరాశపరచడంతో కొంత గ్యాప్ తీసుకుని మంచి కథతో రావాలని షారుఖ్ భావిస్తున్నాడు. బాలీవుడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు పరాజయం ఎరుగని క్రేజీ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో షారుఖ్ తదుపరి చిత్రం ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 

మళ్ళీ చిరంజీవి టైటిలే.. డైరెక్టర్ వాడకం మామూలుగా లేదుగా!

ఇక మెర్సల్, బిగిల్ లాంటి హిట్ మూవీస్ తెరకెక్కించిన దర్శకుడు అట్లీతో కూడా సంప్రదింపులు జరుగుతున్నాయి. త్వరలో షారుఖ్ తో ఓ సినిమా చేస్తానని అట్లీ కూడా ఇదివరకే ప్రకటించాడు.