తమిళంలో సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న హీరో విజయ్. అభిమానులు ముద్దుగా ఇళయదళపతి అని పిలుచుకుంటారు. ఇటీవల విజయ్ నటించిన చిత్రాలు అభిమానుల్లో అతడిపై క్రేజ్ ని డబుల్ చేశాయి. విజయ్ కి ప్రస్తుతం ఉన్న క్రేజ్ తో అతడు నటించే చిత్రాలకు యావరేజ్ టాక్ వచ్చినా సూపర్ హిట్ రేంజ్ లో వసూళ్లు నమోదవుతున్నాయి. 

ఈ ఏడాది విజయ్ 'బిగిల్' చిత్రంతో విజయాన్ని అందుకున్నాడు. అట్లీ దర్శత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఫుట్ బాల్ క్రీడ కథాంశంతో ఆకట్టుకుంది. ప్రస్తుతం విజయ్ లోకేష్ కనకరాజ్ దర్శత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. విజయ్ కి ఇది 64వ చిత్రం. నూతన సంవత్సరం సందర్భంగా కొద్దిసేపటి క్రితమే చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్ విడుదల చేసింది. 

ఈ చిత్రానికి 'మాస్టర్' అనే టైటిల్ ఖరారు చేశారు. ఫస్ట్ లుక్ లో విజయ్ గెటప్ విభిన్నంగా ఉంది. తలపై చేయి పెట్టుకుని విజయ్ ఆసక్తికరంగా కనిపిస్తున్నాడు. ఫస్ట్ లుక్ విడుదలైన క్షణాల్లోనే విజయ్ అభిమానులు సోషల్ మీడియాలో రచ్చ మొదలు పెట్టారు. మాస్టర్ మూవీ ఫస్ట్ లుక్ పై లక్షల్లో ట్వీట్స్ నమోదవుతున్నాయి. 

అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండడం విశేషం. గ్జావియర్ బ్రిట్టో సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇదిలా ఉండగా ఈ చిత్ర దర్శకుడు లోకేష్ కనకరాజ్ వరుసగా మెగాస్టార్ చిరంజీవి టైటిల్స్ ని ఉపయోగిస్తుండడం విశేషం. ఈ దర్శకుడు చివరగా తెరకెక్కించిన మూవీ ఖైదీ. కార్తీ హీరోగా నటించిన ఈ చిత్రం తెలుగు తమిళ భాషల్లో సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. 

మళ్ళీ ఎన్టీఆర్ సున్నా.. ఫ్యాన్స్ కు తప్పని నిరాశ!

ఖైదీ చిరంజీవి కెరీర్ లో మైలురాయిగా నిలిచిపోయిన చిత్రం. ఖైదీ టైటిల్ ని కార్తీ చిత్రానికి ప్రకటించగానే మంచి అటెన్షన్ ఏర్పడింది. ఇప్పుడు మళ్ళి మరోసారి విజయ్ చిత్రానికి చిరంజీవి టైటిల్ ఉపయోగించాడు. మాస్టర్ అనేది 90 దశకంలో విడుదలైన చిరంజీవి చిత్రం.