టాలీవుడ్ 'మా' అసోసియేషన్ లో జరుగుతున్న గొడవలు తీవ్ర వివాదానికి కారణం అవుతున్నాయి. గత ఏడాది కాలంలో ఎవరూ ఊహించని విధంగా మా సభ్యులు బహిరంగంగానే విమర్శలకు దిగారు. ముఖ్యంగా మా అసోసియేషన్ లో ఉన్నత పదవుల్లో ఉన్న వారిమధ్యే తీవ్ర విభేదాలు తలెతుతున్నాయి. మా అసోసియేషన్ ప్రస్తుతం నరేష్ వర్గం, రాజశేఖర్ వర్గంగా రెండుగా చీలిపోయింది. 

ఇటీవల మా డైరీ లాంచ్ కార్యక్రమంలో చిరంజీవి, రాజశేఖర్ మధ్య మీడియా ముఖంగానే వాగ్వాదం జరిగింది. మా అసోసియేషన్ లో అనేక విభేదాలు ఉన్నాయాని రాజశేఖర్ ప్రస్తావించగా.. మంచి ఏదైనా మైకులో చెబుదాం.. చెడు గురించి చెవిలో చర్చించుకుందాం అని చిరంజీవి అన్నారు. 

అయినా కూడా రాజశేఖర్ మాత్రం ఆగలేదు. మా లో జరుగుతున్న విషయాలని బహిరంగంగా ప్రస్తావించడంతో చిరంజీవి అసహనానికి గురయ్యారు. కాసేపు వారి మధ్య వాదనలు జరిగిన అనంతరం రాజశేఖర్ అక్కడి నుంచి అలిగి వెళ్లిపోవడం వెంటనే మా ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేయడం జరిగింది. 

తండ్రి వల్లే బలైందా.. అంతా అసత్యం, ఐటీ రైడ్స్ పై రష్మిక రియాక్షన్!

దీనిపై తాజాగా సుమన్ స్పందించారు. నటుడిగా 40 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా సుమన్ తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మా వివాదం గురించి మాట్లాడారు. మా డైరీ ఆవిష్కరణ సంధర్భంగా మంచి ఉంటే మైకులో మాట్లాడుకుందాం.. చెడుని చెవిలో చర్చించుకుందాం అని చిరంజీవిగారు చాలా బాగా మాట్లాడారు. 

'అల.. వైకుంఠపురములో' బ్యూటీ సెక్సీ ఫోజులు!

రాజశేఖర్ గారు కూడా మా అసోసియేషన్ కు ఎంతో చేశారు. కానీ రాజశేఖర్ మీడియా ముఖంగా మాట్లాడారు. మాలో ఏదైనా సమస్య ఉంటే అంతర్గతంగా చర్చించుకోవాల్సింది. మీడియా ముందు అలా మాట్లాడి ఉండాల్సింది కాదు. ఆరోజు జరిగిన తప్పు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకోవాలి అని సుమన్ అన్నారు.