ఉపాసనతో గొంతుకలిపిన నటి.. మోడీపై విరుచుకుపడ్డ ఖుష్బూ!
జాతిపిత మహాత్మా గాంధీ 150వ జయంతిని పురస్కరించుకుని భారత ప్రధాని నరేంద్రమోడీ ఢిల్లీలో ఛేంజ్ విత్ ఇన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఈవెంట్ కు బాలీవుడ్ ప్రముఖులు, పర్యాటక రంగానికి చెందినవారిని ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
ఛేంజ్ విత్ ఇన్ కార్యక్రమంలో బాలీవుడ్ స్టార్లు అమీర్ ఖాన్, షారుఖ్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, కంగనా రనౌత్ లాంటి వారు సందడి చేశారు. ఇంకా బాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒక్క దిల్ రాజు మినహా దక్షిణాదికి చెందిన పేరుమోసిన సెలెబ్రిటీలు ఎవరూ కనిపించలేదు.
ఈ అంశం సౌత్ సినీ ప్రముఖుల్ని, అభిమానులని నిరాశకు గురిచేసింది. అందరికంటే ముందుగా ఈ విషయంలో రాంచరణ్ సతీమణి ఉపాసన సూటిగా ప్రధాని మోడీని ప్రశ్నించారు. చిత్ర పరిశ్రమతో మోడీ నిర్వహించిన సమావేశానికి దక్షణాది ప్రముఖుల్ని ఆహ్వానించకపోవడం ఏంటని ఆమె ప్రశ్నించిన సంగతి తెలిసిందే.
భారత చిత్ర పరిశ్రమ అంటే కేవలం బాలీవుడ్ మాత్రమే కాదని సౌత్ లో కూడా సినీ రంగం ఉందని ఉపాసన మోడీకి రాసిన లేఖలో పేర్కొన్నారు. తాజాగా ఉపాసనతో సీనియర్ నటి ఖుష్బూ గొంతు కలిపారు. వరుస ట్వీట్స్ తో మోడీపై ఆమె విరుచుకుపడ్డారు.
మోడీ నిర్వహించిన ఛేంజ్ విత్ ఇన్ కార్యక్రమానికి హాజరైన ప్రముఖులపై నాకు గౌరవం ఉంది. కానీ బాలీవుడ్ నుంచి మాత్రమే భారత ప్రభుత్వానికి ఆదాయం రావడం లేదనే విషయాన్ని నేను ప్రధానికి తెలియజేస్తున్నా. దక్షణ భారత సినీ రంగం భారత ఆర్థిక వ్యవస్థకు పెద్ద మొత్తంలో డబ్బు అందిస్తోంది.
దక్షిణాదిలో కూడా ఎందరో గొప్ప నటులు, దర్శకులు, నిర్మాతలు ఉన్నారు. ఇండియాలో సూపర్ స్టార్స్ గా, అత్యుత్తమ టెక్నీషియన్లుగా పేరు ప్రఖ్యాతలు పొందినది దక్షిణాదివారే. కానీ ఛేంజ్ విత్ ఇన్ కార్యక్రమానికి సౌత్ లో ఒక్కరిని కూడా ఆహ్వానించలేదు.. దీనికిగల కారణాన్ని ప్రధాని తెలియజేయాలి. దక్షణాది వారిని కూడా గౌరవించండి.. దీని గురించి మీరు ఆలోచించాలి అని ఖుష్బూ సోషల్ మీడియా వేడిగా ప్రధాని మోడీని డిమాండ్ చేశారు.
ఇవి కూడా చదవండి:
మోడీపై రాంచరణ్ భార్య ఉపాసన సంచలన వ్యాఖ్యలు.. మీకు మేం కనిపించలేదా!
మోడీని చుట్టుముట్టిన అందాల భామలు.. వైరల్ అవుతున్న ఫొటోస్!