జాతిపిత మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా చిత్ర పరిశ్రమ నిర్వహించిన ఓ కార్యక్రమంలో మోడీ ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ ఇండియాలో వినోదరంగం అద్భుతంగగా ఉందని ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ టాప్ సెలెబ్రిటీలు షారుఖ్ ఖాన్, అమిర్ ఖాన్, సినీ నిర్మాతలు, దర్శకులు, హీరోయిన్లు పాల్గొన్నారు. 

ఈ సంధర్భంగా మోడీ సినీ ప్రముఖులతో దిగిన సెల్ఫీలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. షారుఖ్, అమిర్ ఖాన్ కలసి మోడీతో ఫోటో దిగారు. రకుల్ ప్రీత్ సింగ్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్, కంగనా రనౌత్ లాంటి అందాల భామల మధ్యలో నిలబడి మోడీ తీసుకున్న సెల్ఫీ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 

భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందని రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియాలో పేర్కొంది. మోడీ ఈ కార్యక్రమంలో పాల్గొనడంపై పీఎంవో కార్యాలయం అధికారిక ప్రకటన చేసింది. సినీరంగం, పర్యాటక రంగానికి చేసిన ప్రముఖులతో మోడీ సమావేశం అద్భుతంగా జరిగిందని పేర్కొంది. 

మోడీ ఈ కార్యక్రమంలో పాల్గొన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల మోడీ బీచ్ లో ప్లాస్టిక్ వస్తువులని వేరుతున్న దృశ్యాలు సామజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఇప్పుడు సినీ ప్రముఖులతో మోడీ దిగిన సెల్ఫీలు ట్రెండింగ్ గా మారాయి. గత కొన్ని రోజులుగా మోడీ సామజిక మాధ్యమాల్లో నాన్ స్టాప్ ట్రెండింగ్ గా ఉన్నారు.