భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్ని వర్గాల ప్రజలతో మమేకమయ్యేందుకు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆదివారం రోజు గాంధీ 150వ జయంతి వేడుకల్ని పురస్కరించుకుని సినిమా, పర్యటక రంగం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎక్కువగా బాలీవుడ్ సెలెబ్రిటీలు, చాలా తక్కువగా సౌత్ సెలెబ్రిటీలు కనిపించారు. 

దీనిని ఉపాసన తప్పుబడుతూ నేరుగా ప్రధాని మోడీనే ప్రశ్నించారు. మోడీకి ట్విటర్ లో ఓ లేఖ రాశారు. ఈ లేఖలో ఉపాసన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. 

నరేంద్ర మోడీ గారు భారత ప్రధాని అయినందుకు మేమంతా గర్విస్తున్నాం. మీకు చాలా గౌరవంతో ఓ విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. వినోదరంగానికి ప్రాతినిధ్యం వహించే సౌత్ ఇండియన్ ప్రముఖులకు ప్రాధాన్యత తగ్గుతోంది. కేవలం హిందీ నటులకు మాత్రమే గౌరవం, ప్రాధాన్యత కల్పిస్తున్నారు. 

సౌత్ సినీ ప్రముఖుల్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ఇది మాకు చాలా బాధకలిగించే అంశం. దీనిపై మీరు దృష్టి సారిస్తారని కోరుకుంటున్నాం అని ఉపాసన ట్విట్టర్ వేదికగా కామెంట్స్ చేశారు. 

మోడీని చుట్టుముట్టిన అందాల భామలు.. వైరల్ అవుతున్న ఫొటోస్!

మెగా కోడలే ప్రధానిపై వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. దీనిపై సినీ ప్రముఖులు, బాలీవుడ్ వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. గాంధీ 150వ జయంతి వేడుకల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో దిల్ రాజుతో పాటు చాలా తక్కువ మంది దక్షణాది సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో కనిపించారు.