మెగా పవర్ స్టార్ రాంచరణ్, సమంత, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో వచ్చిన రంగస్థలం చిత్రం టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రం క్లాసిక్ అని కూడా ప్రశంసలు దక్కాయి. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఇక రామ్ చరణ్, సమంత నటనతో అదరగొట్టారు. 

ప్రస్తుతం సమంత జాను చిత్ర ప్రచార కార్యక్రమాల్లో బిజీగా గడుపుతోంది. ఓ ఇంటర్వ్యూలో సమంత ఇటీవల కాలంలో ఎక్కువగా అద్భుతమైన చిత్రాల్లో నటించడంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కొన్ని సార్లు మన జడ్జిమెంట్ మంచి ఫలితాన్ని ఇస్తుంది. కానీ కొన్నిసార్లు అదృష్టం కలసి రావాలి. 

అర్థ నగ్నంగా డెడ్లీ విలన్ భార్య.. 'బట్టలు సరిగా వేసుకో' అంటూ ట్రోల్స్

రంగస్థలం చిత్ర కథని వినకుండానే అంగీకరించా. రామలక్ష్మి పాత్ర కూడా పూర్తిగా వినలేదు. కేవలం ధైర్యంతో, దర్శకుడిపై నమ్మకంతో ఆ చిత్రానికి అంగీకరించా. ఆ చిత్రం నా కెరీర్ లో వచ్చిన బెస్ట్ మూవీస్ లో ఒకటి. కొన్ని సార్లు అలా అదృష్టం కూడా కలసి రావాలి అని సమంత పేర్కొంది. 

ఇక ఇండస్ట్రీలోకి వస్తున్న వర్థమాన నటీమణులకు కూడా సమంత తనదైన శైలిలో సలహా ఇచ్చింది. మంచి పేరు సాధించాలని కష్టపడితే డబ్బు కూడా వస్తుంది. కానీ డబ్బు కోసం మాత్రమే కష్టపడకూడదు అని సమంత తెలిపింది. 

ఫ్లైట్ కోసం రష్మిక పరుగో పరుగు.. ఫన్నీ కామెంట్స్ తో వీడియో వైరల్!

సమంత, శర్వానంద్ జంటగా నటించిన జాను చిత్రం శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు రానుంది. తమిళంలో సంచలన విజయం సాధించిన 96 చిత్రానికి ఇది రీమేక్. ఎమోషనల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన జాను చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి.