థానోస్.. మర్వెల్ స్టూడియోస్ నుంచి వచ్చిన అవెంజర్స్ చిత్రాల ద్వారా ఈ పేరు పెద్దల నుంచి చిన్న పిల్లల వరకు అందరికి బాగా తెలుసు. ఒకరకంగా చెప్పాలంటే సిల్వర్ స్క్రీన్ పై బిగ్గెస్ట్ విలన్ థానోస్. సూపర్ హీరోలందరూ ఏకమైనప్పటికీ థానోస్ ని అంతమొందించడానికి చాలా శ్రమించాల్సి వచ్చింది. చరిత్రలో నిలిచిపోయే ఆ పాత్రని పోషించిన హాలీవుడ్ నటుడు జోష్ బ్రోలిన్ ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు సొంతం చేసుకున్నాడు. 

అంతటి మహా విలన్ పాత్రలో నటించిన బ్రోలిన్ రియల్ లైఫ్ లో చాలా జోవియల్ గా ఉంటాడు. ఫ్యామిలీతో, స్నేహితులతో గడుపుతూ పార్టీల్లో ఎంజాయ్ చేస్తుంటాడు. 2016లో బ్రోలిన్.. కాత్రిన్ బొయిడ్ అనే మోడల్ ని వివాహం చేసుకున్నాడు. ఇది అతడికి మూడో వివాహం. భార్యతో ఎంజాయ్ చేస్తూ ఆ ఫోటోలని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటుంటాడు. 

కాత్రిన్ హాట్ లుక్ లో అదరగొట్టే పిక్స్ ని సైతం బ్రోలిన్ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటాడు. దీనితో కాత్రిన్, బ్రోలిన్ పై ట్రోలింగ్ జరుగుతోంది. ఓ నెటిజన్ విమర్శకులు బ్రోలిన్ ఘాటుగా సమాధానం ఇచ్చి అతడి నోరు మూయించాడు. 

నీ భార్య ప్రయివేట్ ఫొటోలని ఎందుకు షేర్ చేస్తున్నావు. ఆమెని బట్టలు సరిగా వేసుకోమని దేవుడు చెబుతున్నాడు అంటూ ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. దీనికి బ్రోలిన్ సమాధానం ఇస్తూ.. నేను కూడా ఇప్పుడే దేవుడితో మాట్లాడా.. నీ నోరు మూయించమని దేవుడు నాతో చెప్పాడు అని బ్రోలిన్ ఘాటుగా రిప్లై ఇచ్చాడు.